Home Andhrapradesh చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..

0
8
chittoor accident
chittoor accident
Spread the love

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై వడమాలపేట చెక్ పోస్టు వద్ద దగ్గర రోడ్డు మార్జిన్లను మార్కింగ్‌ చేస్తున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
చెక్ పోస్టు సమీపంలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై మార్కింగ్‌ చేసేందుకు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకు చెందిన మార్కింగ్ వాహనం నిలిపి వుంచారు. రోడ్డు మార్జిన్లను గుర్తించే తెలుపు రంగు వేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
హైవే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తమ వాహనాన్ని రోడ్డు పక్కన ఉంచి పనులు చేసుకుంటున్నారు. అతివేగంతో వచ్చిన లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇదే రోడ్డుపై వస్తున్న కారు వేగాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాదానికి గురైన కారును అదే రోడ్డుపై వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
వడమాల పేట చెక్‌పోస్ట్ వద్ద కొద్ది సెకన్ల వ్యవధిలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదట ఆగిఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడం.. అది అది రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఉండడం.. ఆ తర్వాత వెంట వెంటనే మరో మూడు వాహనాలు దానిని ఢీకొట్టడంతో ప్రాణ నష్టం సంభవించింది.
కాగా ఈ రోడ్డుప్రమాదానికి అతివేగమే కారణంగా గుర్తించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం కారణంగా చెన్నై-తిరుపతి మార్గంలో ఇరువైపులా కిలోమీటరు పొడవున వాహనాలు నిలిచిపోయాయి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here