Home » Mega DSC 2024 : మెగా డిఎస్సీ.. మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లింపు గడువు
Mega DSC 2024

Mega DSC 2024 : మెగా డిఎస్సీ.. మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లింపు గడువు

Spread the love

TS DSC Notification 2024:  నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా  ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC 2024) ఎట్టకేలకు విడుదలైంది.  గత సెప్టెంబర్‌లో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం.. 11వేల పోస్టులతో తాజా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి (CM Revanth ) గరువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.

తెలంగాణ డిఎస్సీ నోటిఫికేషన్‌ను DSC Notification 2024 సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. 2023 సెప్టెంబరు 6వ తేదీన  గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌ను  రద్దు చేస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. అదనపు ఉద్యోగాలతో కలిపి కొత్తగా 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సీ Mega DSC నోటిఫికేషన్ జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  గతంలో డిఎస్సీ DSC నోటిఫికేషన్‌ సమయంలో  దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.  నోటిఫికేషన్‌ జారీ చేసింది.

విభాగాల వారీగా ఖాళీలు ఇవీ..

  • స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు – 2629
  • లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులు – 727
  • ఎస్జీటీ పోస్టులు – 6508
  • పీఈటీ పోస్టులు – 182
READ MORE  TGSPDCL | కరెంట్ బిల్లుల చెల్లింపులపై వినియోగదారులకు కీలక మార్గదర్శకాలు..

స్కూల్ అసిస్టెంట్లు (SA), సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), లాంగ్వేజ్ పండిట్లు (LP )& ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET ),  ప్రాథమిక స్థాయిలో   స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కోసం DSC-2024  నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని స్థానిక సంస్థల పాఠశాలల్లో టీచర్ల నియామకాలను చేపట్టనున్నారు.

తాజా నోటిఫికేషన్ తో  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లుచ  ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు,  ప్రైమరీ  స్కూళ్లలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమించనున్నారు.  ఈ మేరకు ప్రభుత్వం G.O.Ms.No.96, ఫైనాన్స్ ద్వారా అనుమతినిచ్చింది.

తాజా ఉత్తర్వులకు అనుగుణంగా, పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం కొత్తగా మార్చి 4  నుంచి ఏప్రిల్ 2  వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2024 మార్చి 4  నుంచి  పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ ‌ https://schooledu.telangana.gov.in (TS DSC Official Website) లో నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. అదేరోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

అన్ని కేటగిరీలలో కలిపి 11,062 పోస్టుల కోసం జిల్లా ఎంపిక కమిటీ-2024 DSC ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ,  స్థానిక సంస్థల పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి, ప్రాథమికోన్నత, ఉన్నత  పాఠశాలల్లో  SGTలు, LPలు, PETలు,  స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను భర్తీ చేయనున్నారు.   జిల్లాల వారీగా నోటిఫైడ్ టీచర్ పోస్టులు అనుబంధంలో ఇస్తారు. అభ్యర్థులు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే  రుసుము చెల్లించి దరఖాస్తు సమర్పించాలని అధికారులు సూచించారు. తాజా డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన ఇన్ ఫర్మెషన్ బులెటిన్ మార్చి 4 నుంచి వెబ్‌సైట్ లో https://schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉంటుంది.

READ MORE  Anganwadi Workers | అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం

డిఎస్సీ 2024 ఫీజు

అప్లికేషన్ ప్రాసెసింగ్, రాత  పరీక్ష కోసం ఒక్కో పోస్ట్‌కు రూ.1000 చొప్పున  చెల్లించాలి. వేర్వేరు పోస్ట్‌లకు హాజరుకావాలనుకునే అభ్యర్థులు ఒక్కో పోస్ట్‌కు విడిగా రూ. వెయ్యి  చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే ప్రతీ పోస్ట్‌కు వేర్వేరు దరఖాస్తులను సమర్పించాలి.

ఫీజు ఎలా చెల్లించాలి.. ?

విద్యాశాఖ వెబ్‌సైట్‌లో https://schooledu.telangana.gov.in ఫీజు చెల్లింపు గేట్‌వే లింక్ ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ / నెట్-బ్యాంకింగ్ ద్వారా ఫీజును మార్చి4 వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఏప్రిల్ 2వ తేదీతో ఫీజు చెల్లింపు గడువు ముగిసిపోతుంది.  ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తిచేయడానికి దశల వారీ విధానాన్ని మార్చి 4  నుంచి అందుబాటులోకి వస్తుంది.  ఈ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 46ఏళ్లుగా నిర్ణయించారు.

READ MORE  IRCTC recruitment 2024 : భారీ వేతనంతో రైల్వే మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. రాత పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక

కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష….

Mega DSC 2024 ఉద్యోగాల భర్తీని కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) కింది “ఆన్‌లైన్”‌లో నిర్వహిస్తారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాలు కింది విధంగా ఉన్నాయి..

  •  హైదరాబాద్
  • రంగారెడ్డి
  • మెదక్
  • సంగారెడ్డి
  •  మహబూబ్‌నగర్
  • వరంగల్
  • కరీంనగర్
  • నిజామాబాద్
  •  ఖమ్మం
  • నల్గొండ
  • ఆదిలాబాద్

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 2024, మార్చి 4
  • దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 2 వరకు
  • అప్లికేషన్‌ ఫీజు: రూ.1000
  • వెబ్‌సైట్‌: https://schooledu.telangana.

అభ్యర్థులు  దరఖాస్తులో పరీక్ష కేంద్రాల ప్రాధాన్యత క్రమాన్ని సమర్పించాలి.  పరీక్ష జరిగే తేదీలలో అయా ఎగ్జామ్ సెంటర్లలో  సామర్థ్యంతో పాటు సీట్ల లభ్యతపై  అభ్యర్థులకు పరీక్ష కేంద్రం కేటాయింపు ఆధారపడి ఉంటుంది. డిఎస్సీ 2024 రాత  పరీక్ష షెడ్యూల్ – పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..