హైదరాబాద్ : మీరు మీ ఆస్తి పన్ను ఇంకా కట్టలేదా?.. పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయా.. అయితే మీ బకాయిలు చెల్లించుకునేందుకు ఇదే చక్కని అవకాశం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలపై విధించే వడ్డీ పై 90 శాతం రాయితీ ప్రభుత్వం ప్రకటించింది.
ఇందుకోసం ‘వన్ టైమ్ స్కీమ్’ (Property Tax one time scheme ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. OTS కింద ప్రభుత్వం ఆస్తి పన్నుపై పేరుకుపోయిన బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తుంది.
2022 23 సంవత్సరం వరకు ఆస్తి పన్ను పూర్తిగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ రాయితీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
పాత బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా వన్ టైం స్కీం తీసుకొచ్చినట్టు తెలిపారు. 2023 మార్చి నాటికి ఆస్తి పన్ను, వడ్డీ, జరిమానాలు చెల్లించిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వారు చెల్లించిన 90% వడ్డీ మొత్తాన్ని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) ఆర్డర్ ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం సర్దుబాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.
మొత్తం అసెస్‌మెంట్‌ల సంఖ్య : 4,97,428
మొత్తం బకాయిలు + బకాయిల వడ్డీ : రూ. 9,803.39 కోట్లు
OTS (2022-23)కి అర్హత కలిగిన అసెస్‌మెంట్‌ల సంఖ్య : 5,25,709
ఆస్తి పన్ను వసూళ్లు (లక్ష్యం 2023-24 కోట్లు) : 2,10 కోట్లు (జనవరి 2024 వరకు) : 1,268.49 కోట్లు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..