Agra Viral Video | మోమోలు తీసుకురాలేద‌ని భర్తపై.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

Agra Viral Video | మోమోలు తీసుకురాలేద‌ని భర్తపై.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
Spread the love

Agra : త‌న‌కు ఇష్ట‌మైన ఇష్టమైన మోమోలు (Momos) తీసుకురావడం మరిచిపోతున్నాని ఓ మ‌హిళ త‌న భ‌ర్త పై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అంత‌టితో ఆగ‌కుండా ప్రతీరోజు తన కోసం మోమోలు తీసుకురావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విస్తూపోయారు. త‌ర్వాత తేరుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదుర్చారు. ఈ ఆస‌క్తిక‌ర‌ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) జిల్లాలో జరిగింది. మల్పురాకు చెందిన ఒక మహిళకు పినహట్‌కు చెందిన వ్యక్తితో 8 నెలల క్రితం వివాహ‌మైంది. అయితే ఉత్త‌రాదిలో బాగా పాపుల‌ర్ మోమోలు బాగా పాపుల‌ర్‌. అయితే స‌ద‌రు మ‌హిళ‌కు కూడా మోమోలు చాలా ఇష్టం. పెళ్లైన కొత్తలో ఆ వ్యక్తి పని తర్వాత ఇంటికి వ‌చ్చేముందు రోజూ భార్య కోసం మోమోలు కొని తెచ్చేవాడు.

కాగా, గత కొన్ని రోజులుగా స‌ద‌రు వ్యక్తి తన భార్య కోసం మోమోలు తేవడం మరిచిపోతున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జ‌రిగాయి. దీంతో ఆమె అలిగి తన పుట్టింటికి వెళ్లింది. అంతేగాక భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చేసిన‌ ఫిర్యాదు చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ జంటను ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రానికి పిలిపించారు.

భార్యాభర్తల మధ్య డీల్ కుదర్చిన పోలీసులు

మరోవైపు పనిఒత్తిడి కార‌ణంగా , ఇంటికి త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు భార్య కోసం మోమోలు తీసుకురావడం మరిచిపోతున్నట్లు స‌ద‌రు వ్యక్తి వెల్ల‌డించాడు. అయితే తన కోసం ప్రతీ రోజు కచ్చితంగా మోమోలు తీసుకురావాల‌ని ఆ మహిళ తెగేసి చెప్పింది. దీంతో పోలీసులు వారిద్దరి మధ్య ఒక డీల్‌ కుదిర్చారు. ఆ వ్యక్తి తన స‌తీమ‌ణి కోసం వారానికి రెండుసార్లు తప్పకుండా మోమోలు తీసుకురావాలని కండీష‌న్ పెట్టారు. దీనికి ఒప్పుకున్న ఆ మహిళ త‌న భర్తతో క‌లిసి ఇంటికి తిరిగి వెళ్లింది.

 


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *