Arogya Maitri Cube | ఆకాశం నుంచి దిగివచ్చిన ఆస్పత్రిని చూడండి.. ప్రపంచంలోనే తొలిసారి భారత్ లో ఆవిష్కరణ..
Arogya Maitri Cube | ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్-లిఫ్టెడ్ పోర్టబుల్ హాస్పిటల్ భారత్ లో అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్య మైత్రి క్యూబ్ పేరుతో పిలిచే డిజాస్టర్ హాస్పిటల్ మే 14న ఆగ్రాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ రన్ చేసింది. విపత్తుల సమయంలో అత్యవసరంగా వైద్య సహాయం అందించేందుకు ప్రాజెక్ట్ భీష్మ్ (project BHISHM) కింద ఆరోగ్య మైత్రి క్యూబ్స్ ను రూపొందించారు. ఎయిర్ బెలున్ లా ఉండే ప్రత్యేక నిర్మాణంలో అత్యవసరంగా ఉపయోగపడే వైద్యపరికరాల కిట్ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా సులువుగా రవాణా చేయడానికి అనువుగా ఉంటుంది.ఎయిడ్ క్యూబ్ అత్యవసర సమయాల్లో వైద్య సహాయాన్ని అందించే అనేక వినూత్న సాధనాలను కలిగి ఉంది. ఇది సమర్థవంతమైన సమన్వయం, రియల్ టైం మానిటరింగ్, వైద్య సేవల సమర్థవంతమైన నిర్వహణ కోసం కృత్రిమ మేధస్సు (AI), డేటా విశ్లేషణలు వంటివి కూడా చేయవచ్చు.కేంద్ర ప్రభుత్వం తొలిసారి 2022 ఫిబ్రవరి లో ప్రాజెక్ట...