Free Bus For Woman | ఫ్రీ బస్సుల్లో మహిళల లీలలు.. ఎంచక్కా పళ్లు తోముతూ.. ఎల్లిపాయ పొట్టు తీస్తూ.. (వీడియో)
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ((Free Bus For Woman) ) .. చాలా మందికి ఎంతో ఉపయోగకరంగా మారింది. బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెగిరిపోయింది. 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో టిజి ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న కొందరు మహిళలు చేస్తున్న పిచ్చిపనులు ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గుర్తిచేస్తున్నాయి. సీటు కోసం మహిళలు కొట్టుకోవడం తరచూ చూస్తున్నాం. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహిళలే అధికంగా ప్రయాణిస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండుగ వేళల్లో అయితే మహిళలతోపాటు పురుషులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావుFree Bus For Woman అయితే ఎలాగూ టికెట్ లేకుండా ప్రయాణించవచ్చని కొదరు మహిళలు.. అవసరం ఉన్నా లేకున్నా బస్సులు...