క్రికెట్ ప్రపంచ కప్ 2023 (Cricket World Cup 2023) కోసం దక్షిణాఫ్రికా(South Africa) క్రికెట్ జట్టు భారతదేశానికి చేరుకుంది. వారు ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో ఉన్నారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లు తమ ప్రాక్టీస్ ప్రారంభించారు. సోమవారం న్యూజిలాండ్తో క్రికెట్ ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు. అయితే కొందరు ఆటగాళ్లు వారు ఉంటున్న నగరం పేరు ‘తిరువనంతపురం’ అని ఉచ్చరించడానికి అవస్థలు పడ్డారు. చూడడానికి ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాంగ్రెస్ నేత శశి థరూర్ షేర్ చేసిన వీడియోలో.. చాలా మంది దక్షిణాఫ్రికా క్రికెటర్లు తిరువనంతపురం పదం సరిగ్గా అనలేక కష్టపడ్డారు. కేశవ్ మహారాజ్, కగిసో రబడా, లుంగి ఎన్గిడి సరిగ్గా చెప్పగలిగారు.
హెన్రిచ్ క్లాసెన్ చాలా సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు.. చివరకు పేరులోని పాత నగరం – త్రివేండ్రం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. “దక్షిణాఫ్రికా వాసులు తిరువనంతపురం చేరుకున్నారు! అయితే వారు ఎక్కడున్నారో ఎవరికైనా చెప్పగలరా?’’ అని థరూర్ వీడియోతో పాటు ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో రాశారు. South Africa Cricketers Struggle To Say ‘Thiruvananthapuram
The South African have arrived in Thiruvananthapuram ! But can they tell anyone where they are? pic.twitter.com/N9LnyVLVH9
— Shashi Tharoor (@ShashiTharoor) October 1, 2023
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.