Posted in

Watch: మెడలో కొండచిలువతో సెల్ఫీ తీయాలని కోరిన తాగుబోతు.. తర్వాత ఏమైందంటే?

Python Strangulates Drunk Man
Spread the love

తిరువనంతపురం: కేరళలో తిరువనంతపురంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి మెడలో కొండచిలువను పెట్టుకొని పెట్రోల్‌ బంకు వద్దకు వెళ్లాడు. సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు. అయితే ఆ కొండచిలువ (Python ) అతడి మెడను చుట్టి గొంతుకు బిగిసి నొక్కడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. (Python Strangulates Drunk Man) స్పందించిన పెట్రోల్‌ బంకు సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తిని కాపాడేందుకు యత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వేగంగా వైర ‌ అయింది.
కేరళలోని కన్నూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి మద్యం సేవించిన చంద్రన్‌.. మెడలో కొండచిలువ వేసుకుని పట్టణంలోని పెట్రోల్‌ బంకు‌ వద్దకు వెళ్లాడు. మెడలోని కొండచిలువతో సెల్ఫీ తీయాలని అక్కడి సిబ్బందిని కోరాడు..

న్యూస్ అప్డేట్స్ కోసం  WhatsApp చానల్ లో చేరండి..

కాగా, ఇంతలోనే చంద్రన్‌ మెడలో ఉన్న కొండచిలువ అతడి మెడకు గట్టిగా చుట్టుకుంది. దీంతో ఊపిరి ఆడకపోగా.. ఉక్కిరిబిక్కిరి అయిన ఒక్కసారిగా అతడు కింద పడిపోయాడు. ఇది చూసి పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్న అభిషేక్‌ వెంటనే స్పందించాడు. ఒక కవర్‌ సంచితో చంద్రన్‌ వద్దకు వెళ్లాడు. అతడి మెడకు చుట్టుకొని ఉన్న కొండచిలువను విడిపించేందుకు యత్నించాడు. చివరకు చంద్రన్‌ మెడను వీడిన ఆ కొండచిలువ పక్కకు వెళ్లిపోయింది. కాగా ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో సంప్రదించవచ్చు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *