Elections 2023: 18 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి … ప్రతీసారి డిపాజిట్ దక్కలేదు.. మళ్లీ ఈసారి…

Elections 2023: 18 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి … ప్రతీసారి డిపాజిట్ దక్కలేదు.. మళ్లీ ఈసారి…
Spread the love

madhya pradesh Elections 2023: మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి చెందిన ప్రమానంద్ తోలానీ గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నాడు. కానీ విజయలక్ష్మి ఆయన్ను ఏనాడూ వరించలేదు.. ఏకంగా 18 సార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన 63ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారికి.. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.. కానీ ఎన్నిఓటములు వచ్చినా ఆయనలో ఆత్మవిశ్వాసం ఇసుమంత కూడా తగ్గలేదు. తాజాగా రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమానంద్ తోలానీ నామినేషన్ దాఖలు చేశారు.. వరుస ఓటములు అతనికి “ఇండోరి ధరి పకడ్” బిరుదును సంపాదించిపెట్టింది.

‘ప్రజలు చాలా తెలివైన వారు..’

నవంబర్ 17న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (madhya pradesh Elections 2023:) ఇండోర్-4 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రమానంద్ తోలని తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, అతను ప్రముఖ వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ.. “ఇది నా 19వ ఎన్నిక. దీనికి ముందు, నేను లోక్‌సభ, అసెంబ్లీ మేయర్ పదవితో సహా 18 సార్లు ఎన్నికలలో పోటీ చేశారు. ఇండోర్ ప్రజలు చాలా తెలివైనవారు. వారు ఖచ్చితంగా నన్ను ఏదో ఒక సమయంలో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

READ MORE  భారతదేశపు మొట్టమొదటి, వేగవంతమైన రైల్ RAPIDX Train వస్తోంది..

ఈసారి ఎన్నికల్లో తాపే గెలిస్తే 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాలపై ఆస్తి పన్ను మాఫీ చేస్తానని, హామీ ఇచ్చారు. ఇంటింటికీ తిరిగి రుసుము లేకుండా డోర్ చెత్త సేకరణ చేపడతామని  తెలిపారు.

కాగా ఆయన కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా గత రెండు తరాలుగా ఎన్నికల్లో పోటీ చేశారు. అయినప్పటికీ, అతని కుటుంబంలోని ఏ సభ్యుడు కూడా ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేదు.. బదులుగా వారు పోటీ చేసిన ప్రతిసారీ వారి సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా కోల్పోతారు. అతని తండ్రి 30 ఏళ్లుగా వేర్వేరు ఎన్నికల్లో పోటీ చేశారు.

READ MORE  HMPV : క‌ల‌వ‌ర‌పెడుతున్న వైర‌స్.. భార‌త్‌లో 7 కేసులు

ఒకప్పుడు తన సతీమణి లక్ష్మీ తోలానీని కూడా మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేసేలా చేశానని, ఆ సమయంలో మేయర్‌ పదవి మహిళా అభ్యర్థికే కేటాయించారని చెప్పారు.
నగరంలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్న తన తండ్రి మేథారం తోలాని 30 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో నిరంతరం పోటీ చేశారని ఆయన పిటిఐకి తెలిపారు. 1988లో మా నాన్న చనిపోయాక 1989 నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు తోలాని కుటుంబంలోని తర్వాతి తరం కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోందని ఆయన అన్నారు.

READ MORE  BJP | తెలంగాణలో బీజేపీ సీట్లు పెరిగాయి.. షాకిచ్చిన అగ్రనేతల ఓటమి

ఆయన కుమార్తె నిషా (32 ఏళ్లు) పిటిఐతో మాట్లాడుతూ “ప్రస్తుతం, నా దృష్టి నా ఉద్యోగంపై ఉంది. అయితే భవిష్యత్తులో అవసరమైతే, మా సోదరి, నేను ఖచ్చితంగా ఎన్నికలలో పోటీ చేసే మా కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళతాము.” అని పేర్కొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *