
Elections 2023: 18 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి … ప్రతీసారి డిపాజిట్ దక్కలేదు.. మళ్లీ ఈసారి…
madhya pradesh Elections 2023: మధ్యప్రదేశ్ ఇండోర్ నగరానికి చెందిన ప్రమానంద్ తోలానీ గత మూడున్నర దశాబ్దాలుగా వివిధ ఎన్నికలలో పోటీ చేస్తూనే ఉన్నాడు. కానీ విజయలక్ష్మి ఆయన్ను ఏనాడూ వరించలేదు.. ఏకంగా 18 సార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన 63ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారికి.. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.. కానీ ఎన్నిఓటములు వచ్చినా ఆయనలో ఆత్మవిశ్వాసం ఇసుమంత కూడా తగ్గలేదు. తాజాగా రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రమానంద్ తోలానీ నామినేషన్ దాఖలు చేశారు.. వరుస ఓటములు అతనికి "ఇండోరి ధరి పకడ్" బిరుదును సంపాదించిపెట్టింది.
‘ప్రజలు చాలా తెలివైన వారు..’
నవంబర్ 17న జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (madhya pradesh Elections 2023:) ఇండోర్-4 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రమానంద్ తోలని తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, అతను ప్రముఖ వార్తా సంస్థ PTIతో మాట్లాడుతూ.. "ఇ...