ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓయువతి తన ప్రియుడితో తలెత్తిన గొడవ కారణంగా కలత చెంది ఆత్మహత్య చేసుకునేందుకు ఏకంగా 80 అడుగుల హైవో్ల్టేజ్ ట్రాన్స్మిషన్ టవర్ ను ఎక్కింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా
మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెల పెండ్రా మార్వాహి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమెను రక్షించేందుకు ప్రియుడు కూడా టవర్ ఎక్కడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
కొంతమంది స్థానికులు టవర్ పైన వీరిద్దరిని గమనించి వెంటనే పెండ్రా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఇరు కుటుంబాలకు డా సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయానికి టవర్ చుట్టూ పెద్ద ఎత్తున గ్రామస్తులు గుమిగూడారు.
పోలీసు అధికారులు ఆ జంటతో చాలాసేపు చర్చలు జరిపి, వారిని కిందికి దిగేలా ఒప్పించారు. గంటల తరబడి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. అక్కడ గుంపులో ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అయితే యువతి టవర్ ఎక్కడానికి కొన్ని గంటల ముందు ఫోన్ కాల్ లో తన ప్రియుడితో తీవ్ర వాగ్వాదానికి దిగిందని స్థానికులు తెలిపారు. ఆమెను కిందికి రమ్మని ఒప్పించేందుకు ప్రియుడు కూడా ఆమెను వెనుకే టవర్ ఎక్కాడు. చివరకు అమ్మాయి ఆమె భాగస్వామి ఇద్దరూ క్షేమంగా కిందకు దిగారు.
ఈ ఘటనపై పోలీసు అధికారులు అధికారికంగా ఎలాంటి కేసు నమోదు చేయనప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు చేయొద్దని యువ జంటకు హెచ్చరించారు.
We have been building transmission towers from ages. This is the first time I have seen someone climb them to commit suicide upset with her lover. Good news, the boyfriend followed her up and convinced her to climb down. All iz well #Chhattisgarh #today pic.twitter.com/3MRpbZ8RJI
— Harsh Goenka (@hvgoenka) August 6, 2023
అయితే ఈ ఘటనపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. “హై వోల్టేజ్ డ్రామా” అని ఒకరు రాశారు. మరొకరు, “వైర్లలో కరెంటు కదలడం లేదు.. కాబట్టి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు.” మరొకరు కామెంట్ చేశారు. “మన దేశం ప్రతిభతో నిండి ఉంది. కొత్త టవర్ క్లైంబింగ్ ఛాంపియన్‌లు” అని కొందరు వ్యాఖ్యానించారు.