సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 

సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 
Spread the love

వరంగల్ పోలీసుల హెచ్చరిక

వరంగల్: ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు హెచ్చరించారు. సోమవారం హన్మకొండలోని కేయూ క్రాస్ వద్ద భారీ శబ్ధం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. కాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో భారీ శబ్బాలు వచ్చేలా సైలెన్సర్లను రీప్లేస్ చేస్తున్నారు. దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ.విరంగనాథ్ ఆదేశాల మేరకు ఇటువంటి ఆకతాయిలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.

ఇందులో భాగంగా కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు విరుద్ధంగా భారీ శబ్ధం వచ్చే సైలెన్సర్లు కలిగిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుంచి సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించివేశారు. తొలగించిన సైలెన్సర్లను మరోమారు వినియోగించకుండా రోడ్డు రోలర్ సాయంతో రెండు వందలకు పైగా సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. కాగా ధ్వంసమైన సైలెన్సర్లలో హనుమకొండకు చెందినవి 70 కాగా, కాజీపేట 65, వరంగల్ 65 ఉన్నాయని పోలీసులు తెలిపారు.

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *