సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) పరిశోధనలో కొన్ని ప్రధాన బ్రాండ్‌లు విక్రయించే తేనెలో కల్తీ ఉందని తేలింది. Centre for Science and Environment ప్రకారం, ఈ బ్రాండ్ లు తయారు చేసే తేనెలో చైనా నుండి దిగుమతి చేసుకున్న చక్కెర సిరప్ కలుపుతున్నట్లు తేలింది.
స్వచ్ఛమైన తేనె.. కొవ్వులు కొలెస్ట్రాల్ లేకుండా అనేక పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అయితే కల్తీ తేనె మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఊబకాయం పెరిగేలా చేస్తుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది, పరిశోధనలో తేలింది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాకరం.
ఈ నేపథ్యంలో తేనె స్వచ్ఛత పరీక్షా పద్ధతుల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
తేనెను కొనుగోలు చేస్తే, అందులో చక్కెరతో కల్తీ ఉందో లేదో ఎలా తనిఖీ చేయవచ్చు? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సూచించిన సాధారణంగా ఇంట్లో చేసే పరీక్ష గురించి తెలుసుకోండి
Honey Adulteration Test
- ఒక గ్లాసులో కొంచెం నీరు పోయాలి.
- దీనికి కొన్ని చుక్కల తేనె కలపండి.
- తేనె పూర్తిగా అడుగున స్థిరపడినట్లయితే, అది కల్తీ కాదు. తేనె నీటిలో చెదిరిపోతే అది కల్తీ తేనెగా భావించాలి.
బ్లాట్ టెస్ట్
తెల్లటి వస్త్రం పై కొంచం తేనె వేసి కొంతసేపు ఉంచాలి. ఆ వస్త్రం తేనెని పీల్చుకొని , వస్త్రం పై రంగు మారక పడితే అది కల్తీ తేనెగా గుర్తించాలి. స్వచ్ఛమైన తేనెని వస్త్రం పీల్చుకోదు. మారక కూడా పడదు. స్వచ్ఛ మైన తేనెకు సాంధ్రత ఎక్కువ కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తాయి.
‘అగ్నిపరీక్ష’
మరో పరీక్షలో అగ్గి పుల్లకి కొంత పత్తిని చుట్టి కాసేపు తేనెలో ముంచాలి. కొంతసేపయ్యాక ఆ అగ్గిపుల్లని కొవ్వొత్తితో కాల్చాలి. పత్తి మంటలో కాలితే అది స్వచ్ఛమైన తేనెగా భావించాలి.. పత్తికి మంటలు అంటుకోకపోతే అది కల్తీ చేయబడిన తేనె అని గుర్తించాలి.
థంబ్ టెస్ట్
మీ బొటనవేలుపై కొద్ది మొత్తంలో తేనె చుక్క వేయండి.. దాని ఆకృతిని గమనించండి.. అది చిందినట్ల పడినా.. సులువుగా అటూ ఇటూ కదిలినా లేదా కారుతున్నట్లయితే బ్యాడ్ లక్.. మీరు కొన్నది కల్తీ తేనె అని నిర్ధారించుకోవాలి.
ఎందుకంటే కల్తీలేని స్వచ్ఛమైన తేనె చుక్కలు వేలిపై బిందువులా కదలకుండా ఉంటుంది. స్వచ్ఛమైన తేనె ఎక్కడికీ కదలదు. ఈ విధంగా తేనెలో కల్తీని గమనించి స్వచ్ఛమైన తేనెని గుర్తించవచ్చు.
రుచి పరీక్ష
స్వచ్ఛమైన తేనె రుచి మీ నాలుకపై ఎక్కువ సేపు ఉండదు. కొన్ని నిమిషాల వ్యవధిలో మాయపైపోతుంది. తేనెను వేడి చేయడం వల్ల దాని రుచి మారుతుంది.. దాని పోషక విలువను తొలగిపోతాయి. అయితే కల్తీ తేనెలో చెక్కెర రసం కలిపిన కారణంగా ఎక్కువ సేపు తీపి రుచి ఉంటుంది.
అనుభవజ్ఞుడైన తేనె టేస్టర్ దాని సువాసన ఆధారంగా స్వచ్ఛమైన తేనెను సులువుగా గుర్తిస్తారు.
వెనిగర్ పరీక్ష
తేనె యొక్క స్వచ్ఛతను నిర్ణయించడానికి వెనిగర్- నీటి మిశ్రమాన్ని తరచుగా ఉపయోగిస్తారు:
ఒక గ్లాసు తీసుకుని అందులో ఒక చెంచా తేనె కలపండి
గ్లాస్ లో 2-3 చుక్కల వెనిగర్ జోడించండి
ఇక ఈ మిశ్రమంలో కొద్ది మొత్తంలో నీరు పోయాలి
కొన్ని నిమిషాలు పక్కన పెట్టండి.. తరువాత గమనించండి
మిశ్రమం నురుగుగా ఉంటే, మీ తేనె కల్తీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ.
శాస్త్రీయ పరీక్ష
తేనె పరిశ్రమల్లో శాస్త్రవేత్తలు, పరిశోధకులు తేనె స్వచ్ఛతను తరచుగా పరిశీలిస్తారు. పోటీ పరిశ్రమల కారణంగా వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. తేనె స్వచ్ఛతను పరిశీలించడానికి అనేక దాని భౌతిక, రసాయన లక్షణాలను పరిశీలిస్తారు. చక్కెర అణువుల అమరికను అంచనా వేస్తారు. అలాగే మూలకణ విశ్లేషణ (elemental analysis) పద్ధతులను పాటిస్తారు.
Electric Vehicles కి సంబంధించిన అప్ డేట్స్ కోసం హరితమిత్ర పోర్టల్, తాజా వార్తల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..
అలాగే ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.