Telugu trending news: ఎప్పుడూ చూడని, వినని దొంగతనం ఒకటి అందరనీ అవాక్కయ్యేలా చేసింది. మనం ప్రతీరోజు మీడియా, సోషల్ మీడియాలో తరచూ వింత వింత చోరీలను చూస్తుంటాం.. కొన్ని ఘటనల్లో దొంగలు ఎంత తెలివిగా తమ పనిని పూర్తి చేస్తారో మీరు కూడా చూసే ఉంటారు.. ఒక్కోసారి ఇలాంటి చోరీ సంఘటన చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేకపోతుంటాం.. అలాంటి దొంగతనం ఘటనే తాజాగా ఇక్కడ కూడా జరిగింది. నిర్మాణంలో ఉన్న రోడ్డునే గ్రామస్తులు దొంగిలించిన విస్తుపోయే సంఘటన వెలుగులోకి వచ్చింది. వినడానికి వింతగా అనిపించినప్పటికీ.. ఈ దోపిడీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యంలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్ లోని జెహనాబాద్‌లో జరిగినట్లు తెలుస్తోంది..
ఇక్కడ చూస్తున్న ఈ వీడియోలో కూలీలు రోడ్డును నిర్మిస్తుండగా.. గ్రామస్థులు దాన్ని దొంగిలించడం కనిపించింది.. ఈ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అయింది. కొంతసేపటి తర్వాత రోడ్డు వేసిన కాంట్రాక్టర్ అక్కడికి చేరుకోగా.. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. . ఇదంతా వీడియో తీసిని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. జహానాబాద్‌లోని మఖద్దుంపూర్ లోని ఔదానా భేగా గ్రామంలో సీఎం గ్రామ సడక్ యోజన కింద రహదారిని నిర్మాణానికి అనుమతి లభించింది. దీంతో గ్రామంలో కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామంలో కాంక్రీట్ ఏయే భాగాల్లో వేయాలో ఆ ప్రాంతాన్ని గుర్తించారు.. కాంట్రాక్టర్ సమక్షంలో ఆ స్థలాల్లో కాంక్రిట్ వేసే పనులను ప్రారంభించారు. అతితక్కువ సమయంలోనే పూర్తి కాంక్రీట్ రోడ్డును సిద్ధం చేశారు. రోడ్డు పనుల అనంతరం కార్మికులు, కాంట్రాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన రోడ్డు లూటీ.. చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే..
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో గ్రామస్తులు మొదట కొత్తగా వేసిన రోడ్డుపై నీటిని చల్లారు.. దాంతో అప్పుడే వేసిన సిమెంట్ కాంక్రీట్ పూర్తిగా పలుచగా మారడంతో పారాలు, గుణపాలతో ఎత్తుకుని తమ ఇళ్లకు తీసుకెళ్లడం ప్రారంభించారు. అందరూ చూస్తుండగానే కొత్తగా వేసిన కాంక్రీట్ రోడ్డు మొత్తాన్ని ఖాళీ చేసేశారు. సుమారు రెండు గంటల తర్వాత కాంట్రాక్టర్ అక్కడి రోడ్డు పరిస్థితి చూసేందుకు వచ్చాడు.. కాగా అక్కడ కనిపించిన సీన్ చూసి ఒక్కసారిగా బిత్తరపోయాడు. రోడ్డు మొత్తాన్ని గ్రామస్తులు దొంగిలించారని గుర్తించాడు. అయితే చేసేది లేక చేతులు కట్టుకుని తిరుగుబాటపట్టాడు.
ఈరోడ్డు చోరీ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. @UtkarshSingh_ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో వీడియో షేర్ అయింది.
बिहार में लोगों ने मुख्यमंत्री की सड़क ही लूट ली!
जहानाबाद के मखदूमपुर के औदान बीघा गांव में मुख्यमंत्री सड़क ग्राम योजना के तहत सड़क बनाई जा रही थी. दावा है कि ढलाई के समय लोग पूरा मटेरियल ही लूट ले गये. बताया जा रहा कि इससे पहले भी ये सड़क ऐसे ही लूट ली गई थी. (@AdiilOfficial) pic.twitter.com/ZCBiStXr5Y
— Utkarsh Singh (@UtkarshSingh_) November 3, 2023