Home » వైరల్ వీడియో : గారడీ చేసినట్లు ఫిల్టర్ కాఫీ ఎలా చేశాడో చూడండి..
Pondicherry viral video

వైరల్ వీడియో : గారడీ చేసినట్లు ఫిల్టర్ కాఫీ ఎలా చేశాడో చూడండి..

Spread the love

ఫ్యాన్సీ కేఫ్‌లు, కార్పొరేట్ కాఫీ చెయిన్‌లు  ఎన్నో ఉన్నప్పటికీ, రోడ్డు పక్కన ఉండే సాంప్రదాయ ఫిల్టర్ కాఫీల రుచులను ఎన్నటికీ మరిచిపోలేము. వేడివేడి ఫిల్టర్ కాఫీ సేవిస్తే మీ ఆలోచనలన్నీ రీఫ్రెష్ అవుతాయి.  అయతే ఇటీవల కాఫీ తయారీకి సంబంధించిన ఒక వైరల్ వీడియో చూస్తే వెంటనే ఆ కాఫీని ఆశ్వాదించాలనిపిస్తుంది. కాఫీ తయారు చేయడంలో ఈ చెఫ్ ప్రదర్శించిన నైపుణ్యం కారణంగా ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది.

READ MORE  Bulls Fight : రెండు ఎద్దుల మధ్య పోట్లాటను అడ్డుకునేందుకు పోలీసుల యత్నం చివరికి ఏం జరిగిందో చూడండి

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ (instagram) ఫుడ్ వ్లాగర్ ‘ఫుడీయాడిక్ట్’ షేర్ చేశారు. అది పాండిచ్చేరిలోని స్థానిక కాఫీ బార్‌లో రికార్డ్ చేయబడిందని క్యాప్షన్ లో పేర్కొన్నారు. క్లిప్ త్రిభుజాకార ఆకృతిలో పేర్చిన సాసర్‌లో 10 మెటల్ గ్లాసులు ఉన్నాయి. చెఫ్, చక్కెరతో నిండిన పాత్రలను పట్టుకుని, టేబుల్‌కి అడ్డంగా నిలబడి చూడవచ్చు. కేవలం రెప్పపాటు సమయంలో, చెఫ్ అన్ని మెటల్ గ్లాసుల్లో చెక్కెరను వేయడం ఇక్కడ గమ్మత్తుగా ఉంటుంది. అది కూడా వంగకుండా ఇలా చేయడం విశేషం. మరింత వినోదభరితమైన విషయం ఏమిటంటే, అతని చేతుల కదలికకు తగినట్లుగా తాల్ సే తాల్ మిలా పాట వినిపిస్తుంది. తరువాత, అతను ఒకదానికి లిక్విడ్ కాఫీని జతచేస్తాడు. అప్పుడు అతను గ్లాసు సాసర్లో పాలతో నింపి, రెండు పాత్రల మధ్య కాఫీని గారడీ చేయడం ప్రారంభించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..