Home » నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..
Telugu viral videos

నిండైన చీరకట్టుతో ఈ మహిళ చేసిన డ్యాన్స్ అదుర్స్..

Spread the love

సాధారణ ప్రజలు తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా చక్కని వేదికగా నిలుస్తోంది. చాలా మంది తమలో మరుగుపడిన నైపుణ్యాలను సోషల్ మీడియాలో చేయడం ద్వారా అవి క్షణాల్లోనే వైరల్ అయి ఊహించని విధంగా ఫేమ్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ తెలుగు మహిళ చేసిన అద్భుతమైన డాన్స్, మ్యాజిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

@koteswari_kannan_official పేరుతో 49,000 మందికి పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్న మహిళ తన Instagram ఖాతాలో వీడియోను పోస్ట్ చేసింది. నిండుగా చీర ధరించి మూడు చిన్న బంతులను గాలిలో ఎగురువేస్తూ ఒక రింగ్ తో హులా హూప్ చేస్తున్న వీడియో చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనిపై పలువురు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.
“ఆమె ప్రతిభకు తనదైన రీతిలో నిర్వచనం.. ట్రెండింగ్ పాటలకు ట్రెండింగ్‌ను సృష్టిస్తోంది” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. “ఒక పుస్తకాన్ని దాని కవర్‌ని బట్టి అంచనా వేయవద్దు” అని మరొకరు రాశారు. “అద్భుతమైన, మైండ్ బ్లోయింగ్ టాలెంట్ మేడమ్ అని ఓ వ్యక్తి రాశారు. లైక్ ల కోసం అందాలను ప్రదర్శించే నేటి కాలంలో మీది అసలైన టాలెంట్ అని మరో నెటిజన్ పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా జనవరిలో ఓ మహిళ సైకిల్‌పై డ్యాన్స్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. బుష్రా అనే మహిళ సైకిల్ తొక్కుతూనే డ్యాన్స్ చేసి తన ప్రత్యేక ప్రతిభతో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. సంప్రదాయ దుస్తులు ధరించి, రోడ్డుపై సైకిల్ తొక్కుతూ డ్యాన్స్ చేస్తూ, తన స్టెప్పులను సింక్రనైజ్ చేస్తూ కనిపించింది. ఆమె సైకిల్ హ్యాండిల్ కూడా పట్టుకోలేదు.. ఈ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

READ MORE  vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..