Home » నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపిన చిరుత..
Jammu And Kashmir news

నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపిన చిరుత..

Spread the love

Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. చిరుతపులి(leopard) నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లి చంపేసింది. ఉధంపూర్ జిల్లా (Udhampur District) లో శనివారం రాత్రి 7-8 గంటల మధ్య జరిగిన ఈ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

సమాచారం అందుకున్న ఉధంపూర్ కంట్రోల్ రూమ్‌.. వెంటనే, బాలికను రక్షించడానికి ఒక బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించింది. ఉదంపూర్‌లోని జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణి విభాగం రేంజ్ అధికారి రాకేష్ శర్మ మాట్లాడుతూ.. “రాత్రి 7-8 గంటల మధ్య, 4 ఏళ్ల బాలికను చిరుతపులి ఎత్తుకెళ్లింది. మాకు సమాచారం అందడంతో ఉదంపూర్ కంట్రోల్ రూమ్ నుంచి బృందాలను పంపించాం. “ఇది చాలా దురదృష్టకర సంఘటన, బాలిక కుటుంబానికి మేము అన్ని సహాయం చేస్తాము,” అన్నారాయన.
జిల్లాలోని పంచారీ తహసీల్‌లోని అప్పర్ బంజలా గ్రామంలోని బాలిక ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో స్థానికులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని శర్మ తెలిపారు. మరోవైపు చిరుతను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
“చిరుతపులి పాపను తీసుకువెళ్లినట్లు సమాచారం అందుకున్న తర్వాత, మా బృందాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే దురదృష్టవశాత్తు ఆమె చనిపోయిందని మేము కనుగొన్నాము” అని అధికారి తెలిపారు. చిరుత(Leopard)ను పట్టుకునేందుకు పెద్దఎత్తున సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామన్నారు.

READ MORE  Protests in PoK : అట్టుడుకుతున్న పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌.. పీఓకేలో హింసాత్మక నిరసనలు ఎందుకు చెలరేగాయి?

తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో చిరుతపులితో సహా అడవి జంతువులు చురుకుగా ఉంటాయి. కాబట్టి, స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. తెల్లవారుజామున, సాయంత్రం సమయంలో, పిల్లలు, మహిళలు, వృద్ధులుఒంటరిగా వెళ్లనివ్వవద్దని కోరారు.


 

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

READ MORE  క‌శ్మీర్‌లో మోదీ ప్రారంభించిన Z-Morh tunnel ప్ర‌త్యేక‌త‌లు ఏంటో తెలుసా?

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..