Friday, February 14Thank you for visiting

Telangana | నిరుద్యోగులకు తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

Spread the love

Rajiv Gandhi Abhaya Hastham : ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువ‌త‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్న‌ట్లు ప్రకటించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం (Rajiv Gandhi Abhaya Hastham) కింద రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం సోమ‌వారం పంపిణీ చేశారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మందికి చెక్కులు స్వీక‌రించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తుచేశారు. సివిల్స్ ఉత్తీర్ణులై కుటుంబాల‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి గౌర‌వం తీసుకురావాల‌ని కోరారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈసంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

యంగ్ ఇండియా యూనివ‌ర్సిటీలో 20 వేల మందికి శిక్ష‌ణ‌

విద్యార్థులు, యువ‌త‌లో తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు ల‌భించ‌డం లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే యంగ్ ఇండియా యూనివర్శిటీ ద్వారా 2 వేల మందికి నైపుణ్య‌ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ అందిస్తామన్నారు. అలాగే, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా మెడ‌ల్స్ వచ్చేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్ ఇండియా గురుకుల పాఠ‌శాల‌లను ఏర్పాటు చేస్తాం. 10, 15 రోజుల్లో అన్ని విశ్వవిద్యాల‌యాల‌కు కొత్త వీసీల‌ను నియమిస్తామ‌ని వెల్ల‌డించారు. కొంత‌మంది ఉద్దేశపూర్వకంగానే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. ధర్నాలు సమస్యలకు పరిష్కారం కాదని, విద్య, ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమానికి త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు.

READ MORE  BJP District Presidents | తెలంగాణలోని 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు వీరే..!

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..