Rain forecast | మరో రెండు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain forecast | మరో రెండు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Spread the love

Rain forecast | హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయ‌ని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపపనాల వ‌ల్ల‌ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని, , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

జ‌య‌శంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డా వర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌ని, ఈ మేరకు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వ‌ర్షం కురుస్తున్న‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని చెప్పారు.

READ MORE  Rain forecast | గుడ్‌న్యూస్‌ చెప్పిన వాతావర‌ణ శాఖ‌.. ఈ సారి స‌మృద్ధిగా వ‌ర్షాలు..!

Rain forecast in Hyderabad : ఇక హైద‌రాబాద్ లో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం తర్వాత జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. నగరంలో కొద్ది రోజులుగా సాయంత్రం, రాత్రి వేళల్లో జ‌ల్లులు కురుస్తున్నాయి. మధ్యాహ్నం కాస్త ఎండగా అనిపించినా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

ఇదిలా వుండ‌గా గ‌త 24 గంటల్లో రాష్ట్రంలోని ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. కొమురంభీం జిల్లా తిర్యాలలో 5.65 సెం.మీ, మహబాద్‌ జిల్లా గార్ల‌లో 5.47 సెం.మీ, జగిత్యాల జిల్లా పెగడపల్లిలో 4.95 సెం.మీ, సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 4.26 సెం.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

READ MORE  Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *