Tuesday, February 18Thank you for visiting

Amazon Web Services | హైద‌రాబాద్ లో అమెజాన్ విస్తరణ.. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు

Spread the love

Amazon Web Services | అమెజాన్ కంపెనీ హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్, కంపెనీ ప్రతినిధుల‌ బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ కంపెనీ కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్ లోనే ఉంది. గత ఏడాది అమెజాన్ డెడికేటెడ్ ఎయిర్ కార్గో నెట్‌వర్క్ ‘అమెజాన్ ఎయిర్’ కూడా ప్రారంభించింది.

తెలంగాణ‌లో వేగంగా విస్త‌ర‌ణ‌

అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు (Amazon Web Services -AWS) సంబంధించి హైదరాబాద్ లో మూడు డేటా సెంటర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌తో పాటు తమ వ్యాపారాన్నివిస్తరించే ఆలోచనలను ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు పంచుకున్నారు.

READ MORE  Amarnath Yatra 2024 | అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే మీకో శుభ‌వార్త‌..

అమెజాన్ తో చ‌ర్చ‌లు విజ‌య‌వంతం

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అమెజాన్‌తో చర్చలు విజయవంతమయ్యాయని ప్రకటించారు. ప్రభుత్వం తరఫున తగినంత సహకారంతో పాటు ఉత్తమమైన ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో భారీ విస్తరణకు కంపెనీ మందుకు వస్తుందని ఆయ‌న‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై హర్షం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ న‌గ‌రం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు.

READ MORE  Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్..

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలు అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?