Home Telangana TGSRTC | ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం

TGSRTC | ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం

0
9
TGSRTC
TGSRTC
Spread the love

TGSRTC | కరీంనగర్‌: తెలంగాణ‌లోని నిరుద్యోగ యువ‌త‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో ఆర్టీసీ (TGSRTC) లో 3000 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈమేర‌కు ఆదివారం కరీంనగర్ (Karimnagar)  జిల్లా కేంద్రంలో నుంచి 33 ఎల‌క్ట్రిక్‌ బస్సులను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ (Ponnam Parbhakar)  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త‌మది ప్రజాపాలన అని, అన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద‌ ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్ల‌డించారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలను అమ‌లు చేస్తామ‌ని తెలిపారు.

కాగా విద్యుత్‌ బస్సుల (Electric Buses)  కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్‌ బస్సు సర్వీసులను నడపాలన్నదే మా ఆలోచన. కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్‌తో నడిచే బస్సు ఒక్కటి కూడా క‌నిపంచ‌కుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. ప్రజాపాలన ఏర్పడిన తర్వాత విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని దినదినాభివృద్ధి చేస్తున్నామ‌ని అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here