Home National భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates

భారత్ మెరుపుదాడి.. ఉద్ర శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ సక్సెస్ | Operation Sindoor LIVE updates

0
8
Operation Sindoor
Operation Sindoor
Spread the love

Operation Sindoor LIVE updates : పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా భారత సైన్యం, భారత వైమానిక దళం బుధవారం తెల్లవారుజామున సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ తోపాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. ‘Operation Sindoor’ కింద సైనిక దాడులు జరిగాయని భారత సైన్యం తెల్లవారుజామున 1:44 గంటలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.

పాకిస్తాన్ (Pakistan), పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులను నిర్మూలించడానికి, కీలకమైన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి వరుస వైమానిక దాడులు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Operation Sindoor : ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా వైమానిక దాడులు

ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో, జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా దళాలు పూర్తి అప్రమత్తతతో ఉన్నాయి, ఏదైనా ప్రతీకార చర్యలకు దిగితే ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా భారత వైమానిక దాడుల్లో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఇది భారతదేశం యొక్క ఉగ్రవాద నిరోధక వ్యూహంలో ఒక ముఖ్యమైన అడుగు అని వర్గాలు నిర్ధారించాయి.

  • బహల్పూర్: పాకిస్తాన్ లోపల 100 కి.మీ. 
  • మురిద్కే: పాకిస్థాన్ లోపల 30 కి.మీ 
  • గుల్పూర్: పాకిస్తాన్ లోపల 35 కి.మీ. 
  • సవాయి క్యాంప్: పాకిస్తాన్ లోపల 30 కి.మీ. 
  • బిలాల్ క్యాంప్: దూరం పేర్కొనబడలేదు 
  • కోట్లి క్యాంప్: పీఓకే లోపల 15 కి.మీ. 
  • బర్నాలా క్యాంప్: పీఓకే లోపల 10 కి.మీ. 
  • సర్జల్ క్యాంప్: పీఓకే లోపల 8 కి.మీ. 
  • మెహమూనా క్యాంప్: పీఓకే లోపల 15 కి.మీ.

Operation Sindoor LIVE updates జమ్మూ కాశ్మీర్‌ (Jammu and Kashmir)లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో, భారత సాయుధ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను భారతదేశం ధ్వంసం చేసింది, అక్కడి నుండే భారతదేశంపై ఉగ్రవాద దాడులు ప్లాన్ చేయబడ్డాయి మొత్తంగా, తొమ్మిది (9) ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ తొమ్మిది ప్రదేశాలలో, నాలుగు పాకిస్తాన్‌లో, ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి. పాకిస్థాన్‌లోని స్థావరాలలో బహవల్‌పూర్, మురిద్కే, సియాల్‌కోట్ ఉన్నాయి.
రక్షణ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో, “25 మంది భారతీయులు ఒక నేపాలీ పౌరుడిని ప్రాణాలు బలిగొన్న అనాగరిక పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టాం’’ అని పేర్కొంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here