Home Telangana ప్రయాణీకుల సౌకర్యం కోసం త్వరలో MEMU రైళ్లు

ప్రయాణీకుల సౌకర్యం కోసం త్వరలో MEMU రైళ్లు

0
13
MEMU
Spread the love

మే 2026 నుంచి కాజీపేట RMUలో ఉత్పత్తి ప్రారంభం

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణలో రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైళ్లను కాజీపేట రైలు తయారీ యూనిట్ (RMU)లో తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డితో మంగళవారం సమావేశమయ్యారు. ఆయన, తెలంగాణకు సంబంధించిన ప్రధాన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.

MEMU రైళ్ల ప్రత్యేకతలు ఇవే:

  • 16–20 కోచ్‌లతో కూడిన ఆధునిక MEMU రైళ్లు
  • గ్రామీణ – సెమీ అర్బన్ ప్రాంతాలను అనుసంధానించేందుకు అనుకూలంగా కనెక్టివిటీ
  • పండుగల సీజన్లలో ప్రయాణీకులకు భారీ ఉపశమనం
  • కాజీపేట RMUలో రూ.716 కోట్లతో నిర్మాణం
  • 2026 జనవరి నాటికి నిర్మాణం పూర్తయ్యేలా లక్ష్యం
  • మే 2026 నుంచి కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం

ఈ ప్రాజెక్టుతో స్థానిక స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాక, రైలు నెట్‌వర్క్ విస్తరణలో తెలంగాణకు ప్రధాన భాగస్వామ్యం లభించనుంది. విస్తృతంగా ప్రాంతీయ కనెక్టివిటీ పెరగడం వల్ల ఆర్ధిక అభివృద్ధి కూడా వేగం పుంజుకునే అవకాశముంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here