Sunday, April 27Thank you for visiting

IRCTC Shirdi Tour | విజయవాడ నుంచి షిర్డీ టూర్.. తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ చేసుకోండి ఇలా..

Spread the love

IRCTC Shirdi Tour From Vijayawada: పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ప్రధానంగా అధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే వారి కోసం అతితక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ప్యాకేజీలను తీసుకొస్తోంది. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీ వెళ్లేందుకు రైలు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ‘SAI SANNIDHI EX – VIJAYAWADA’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని నిర్వహిస్తోంది. మొత్తం 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ టూర్ నవంబర్ 1 నుంచి అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది.

టూర్ షెడ్యూల్ :

Day 1: మొదటి రోజు విజయవాడలో ప్రారంభమవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208 – Sainagar Shirdi Express) ఎక్కాలి.. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
Day – 2: రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ కు చేరుకుంటారు. ఆ తరువాత షిర్డీకి బయలుదేరుతారు. హోటల్‌లో చెకిన్ ఐన తర్వాత షిర్డీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైం ఉంటుంది. రాత్రికి షిరిడీలోనే బస చేయాల్సి ఉంటుంది.

READ MORE  AP Heavy Rains | ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..

Day – 3 : ఇక 3వ రోజు ఉదయం శనిశంగ్నాపూర్ సందర్శన ఉంటుంది. అక్కడి నుంచి మళ్లీ షిరిడీ చేరుకోవాలి. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ రైల్వేస్టేషన్‌లో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

Day 04 Friday: తెల్లవారుజామున 2.50 గంటలకు విజయవాడ స్టేషన్ కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ పరిసమాప్తమవుతుంది.

IRCTC ప్యాకేజీ టికెట్ ధరలు ఇవే:

విజయవాడ – షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలను పరిశీలిస్తే కంఫర్ట్ క్లాస్ (3 ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 15,670 ధర ఉండగా… డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,050, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8.300 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు టికెట్ ధరలు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,840 ధరగా నిర్ణయించారు. ఈ ప్యాకేజీ టూర్ ను బుకింగ్ చేసుకోవడం, అలాగే పూర్తి వివరాలను https://www.irctctourism.com వెబ్ సైట్ లో చూడవచ్చు.

READ MORE  Rains | రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..