Home » Video : మద్యం మత్తులో రైలు పట్టాలపై లారీ నడిపిన డ్రైవర్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

Video : మద్యం మత్తులో రైలు పట్టాలపై లారీ నడిపిన డ్రైవర్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

Spread the love

Drunk Man Drives Truck On Railway Track | మద్యం మత్తులో ఓ డ్రైవర్‌ లారీని ఏకంగా రైలు పట్టాలపై నడిపాడు. (Drunk Man Drives Truck On Railway Track) అయితే ఆ లారీ.. రైలు పట్టాల మధ్య చిక్కుకుపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో మరో ట్రాక్ పై వస్తున్న ఎక్స్ ప్రెస్‌ రైలు లోకో పైలట్‌ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు.

చండీగఢ్‌: చిత్తుగా మద్యం సేవించి మత్తులో ఉన్న ఒక డ్రైవర్‌ లారీని ఏకంగా రైలు పట్టాలపై నడిపాడు. (Drunk Man Drives Truck On Railway Track) అయితే ఆ లారీ రైలు పట్టాల వద్ద చిక్కుకుపోవడంతో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంతలో మరో ట్రాక్‌పై వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు లోకో పైలట్‌ పట్టాలపై లారీ నిలిచి ఉండడాన్ని గమనించాడు. వెంటనే అతడు ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ షేర్పూర్ ఫ్లైఓవర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ పైకి లారీని నడిపాడు. రైలు పట్టాల మధ్యన ఇరుకున్న లారీ అక్కడి నుంచి ముందుకు కదలలేదు. దీంతో ఆ లారీని అక్కడే వదిలేసి డ్రైవర్‌ పారిపోయాడు..
కాగా, గోల్డెన్ టెంపుల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ లూథియానా స్టేషన్‌కు చేరుకోవా ల్సి ఉంది. ఈ క్రమంలో రైలు పట్టాల మధ్యలో లారీ నిలిపి ఉండడాన్ని లోకో పైలట్‌ గమనించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు.. దీంతో ఆ రైలు లారీని కొద్దిగా తాకి ఆగిపోయింది.. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదు.
విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు, రైల్వే, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రైలు పట్టాల మధ్యలో నిలిచి ఉన్న లారీని క్రెయిన్ సాయం‌తో అక్కడి నుంచి తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పరారైన లారీ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.
కాగా, ఈ ఘటన కారణంగా లూథియానా స్టేషన్‌కు చేరుకోవాల్సిన, అక్కడి నుంచి వెళ్లాల్సిన పలు ట్రైన్లు కొంత ఆలస్యంగా బయలుదేరాయి. పట్టాల మధ్యన లారీ నిలిచి ఉన్న వీడియో క్లిప్‌ లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

READ MORE  Indian Railways | వేసవిలో ప్ర‌యాణికుల కోసం పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక రైళ్లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..