
Indian Americans | బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలపై ఇస్లామిస్ట్ తీవ్రవాదులు చేస్తున్న భయంకరమైన హింసను నిరసిస్తూ హ్యూస్టన్‌లోని షుగర్ ల్యాండ్ సిటీ హాల్‌లో 300 మందికి పైగా భారతీయ అమెరికన్లు బంగ్లాదేశ్ మూలాల హిందువులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు.
బంగ్లాదేశ్‌లో బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్న మైనారిటీ కమ్యూనిటీలను రక్షించడానికి, వీరిపై దురాగతాలను నివారించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈవెంట్ నిర్వాహకులు బిడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరారు. హిందూ జనాభాపై ఇటీవలి తీవ్రతరమవుతున్న హింస మరింత ముప్పును తీసుకువచ్చే ప్రమాదముంది. బంగ్లాదేశ్‌లోని అన్ని మతపరమైన మైనారిటీల రక్షణ, భద్రతను పెంచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు, మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఈ ఘోరమైన నేరాలు కొనసాగుతున్న తరుణంలో US ప్రభుత్వం చూస్తూ ఊరుకోవద్దని డిమాండ్ చేశారు.
“సేవ్ హిందువులను బంగ్లాదేశ్‌లో రక్షించండి” అనే పేరుతో బంగ్లాదేశ్ మైనారిటీల కోసం గ్లోబల్ వాయిస్ నిర్వహించింది, మైత్రి, విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, హిందూయాక్షన్, హిందూప్యాక్ట్, హ్యూస్టన్ దుర్గాబారి సొసైటీ, ఇస్కాన్, గ్లోబల్ కాశ్మీరీతో సహా ప్రముఖ హ్యూస్టన్ హిందూ సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస, దౌర్జన్యాలను అరికట్టాలని పిలుపునిస్తూ తమ ప్లకార్డులను ప్రదర్శించారు.
‘Save Bangladeshi Hindus’ Protest Attracts Hundreds In Houston
Around 300 Indian-origin Americans gathered for a vigil to condemn the attacks on Hindus following the resignation of PM Hasina, urging the US govt to prevent further violence.pic.twitter.com/OtIvIseVnK
— RT_India (@RT_India_news) August 12, 2024
“హిందూ సమాజంపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బంగ్లాదేశ్‌లోని మా సోదరులు సోదరీమణులకు సంఘీభావంగా మేమంతా అండగా ఉంటాము. బంగ్లాదేశ్ ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకుని నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలి. మత విశ్వాసాలతో సంబంధం లేకుండా తమ పౌరులందరికీ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము! అని వీహెచ్‌పీ, హిందూయాక్షన్ ప్రతినిధి పేర్కొన్నారు. “బంగ్లాదేశ్‌లో తిరుగుబాటుతో, 10 మిలియన్ల హిందువులు ప్రమాదం లో ఉన్నారని తెలిపారు.
“బంగ్లాదేశ్‌లోని హింసలు, హత్యలు హిందూ దేవాలయాలను తగులబెట్టడం, మహిళలపై లైంగిక దాడులు వంటి బాధాకరమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హింస హిందువులకే కాకుండా భారతదేశం వంటి దేశాలలో ప్రజాస్వామ్య పునాదులకు కూడా తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుంది. ఇది పాకిస్తాన్‌లోని హిందువులకు కూడా ముప్పుగా ఉంది అని పేర్కొన్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..