NIRF Ranking 2024: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ లో టాప్ 10 విద్యాసంస్థ‌లు ఇవే..

NIRF Ranking 2024: నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ లో టాప్ 10 విద్యాసంస్థ‌లు ఇవే..

NIRF Ranking 2024 Top Englineering Institutes: విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) 2024. ప్రకారం విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ (IIT MADRAS) భారతదేశంలో అత్యుత్తమ సంస్థగా ప్రకటించింది. IISc బెంగళూరు దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT MADRAS) గత ఏడాది కూడా వరుసగా ఐదవ సంవత్సరం అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ఉత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచింది. ఆసక్తికరంగా, IIT-మద్రాస్ గత 8 సంవత్సరాలుగా ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా కూడా ర్యాంక్ ను పొందింది.

READ MORE  RRB NTPC Notification 2024 | నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 11558 రైల్వే ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌..

ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ తొమ్మిదో ఎడిషన్‌లో ఈసారి ‘ఓపెన్ యూనివర్శిటీలు’, ‘స్కిల్ యూనివర్శిటీలు’ ‘స్టేట్ ఫండెడ్ గవర్నమెంట్ యూనివర్శిటీలు’ వంటి మూడు కొత్త కేటగిరీలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏఐసీటీఈ చైర్‌పర్సన్ అనిల్ సహస్రబుధే మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి మంత్రిత్వ శాఖ ‘సుస్థిరత ర్యాంకింగ్స్’ను ప్రారంభిస్తుందని తెలిపారు.

ఈ సంవత్సరం NIRF ర్యాంకింగ్‌లో, ఉన్నత విద్యా సంస్థలు 16 విభాగాల కింద టాప్ లిస్ట్ ను రూపొందించారు. మొత్తం, విశ్వవిద్యాలయాలు, వైద్య, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, లా, ఆర్కిటెక్చర్, కళాశాలలు, పరిశోధనా సంస్థలు, ఫార్మసీ, డెంట‌ల్‌, వ్యవసాయం, అనుబంధ రంగాలు, రాష్ట్ర నిధులతో న‌డిచే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, స్కిల్ యూనివ‌ర్సిటీలు, ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయి. గతేడాది 5,543 ఉన్నత విద్యా సంస్థలు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో పాల్గొన్నాయి.

READ MORE  Cosmetology Institute | ఫ్యాష‌న్ ప్రియుల‌కు పండగే.. హైదరాబాద్‌లో కాస్మోటాలజీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం..

NIRF ర్యాంకింగ్స్ 2024: భారతదేశంలోని టాప్ 10 ఇంజనీరింగ్ కళాశాలలు

  • IIT మద్రాస్
  • IIT ఢిల్లీ
  • IIT బాంబే
  • IIT కాన్పూర్
  • IIT ఖరగ్‌పూర్
  • IIT రూర్కీ
  • IIT గౌహతి
  • IIT హైదరాబాద్
  • IIT తిరుచ్చి
  • IIT-BHU (వారణాసి)

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *