
Kolkata Doctor case | కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యంత దారుణంగా ఆమెపై అత్యాచాచారానికి ఒడిగట్టి ఆపై కిరాతకంగా హత్య చేశారు. అయితే ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వెలడైన విషయాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్న వైద్యురాలిని మృగాడు. అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాడు.కళ్లు, నోరు, ముక్కు, ప్రైవేటు భాగాల నుంచి తీవ్రంగా రక్తస్రావం జరగడంతో ఎంత దారుణంగా హత్యాచారానికి గురైందో ఊహించడానికే భయమేస్తుంది. మరోవైపు ఫైనల్ రిపోర్టు కోసం పోలీసులు చూస్తున్నారు.ఈ నివేదిక వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి.
కాగా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. హత్యాచారం తర్వాత నిందితుడు ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోయినట్లు తెలిపారు. నిద్ర లేచాక బట్టలపై ఉన్న రక్తపు మరకలు కనబడకుండా ఉతుక్కున్నాడు. అయితే బూట్లపై మాత్రం రక్తపు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సివిల్ వలంటీర్ అయిన సంజయ్ రాయ్‌కి ఆస్పత్రితో ఎలాంటి సంబంధం లేదని, అప్పుడప్పుడు మాత్రం ఆస్పత్రికి వస్తాడని విచారణలో తేలిందని చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని సిటీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ వెల్లడించారు. అయితే బాధితురాలి తుది పోస్టుమార్టం రిపోర్టు కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.
ప్రాథమిక పోస్ట్‌మార్టం రిపోర్టులో బాధితురాలి కళ్లు, నోరు, ప్రైవేటు అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లు తేలిందని సమాచారం. అంతేకాకుండా ఇతర భాగాల్లో కూడా గాయాలు ఉన్నట్లుగా వెలుగులోకి వచ్చింది. వైద్యురాలిని మొదట హత్య చేసి.. ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఉంటాడని మరో పోలీసు అధికారి తెలిపారు. గురువారం అర్ధరాత్రి వరకు బాధితురాలు కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఒలింపిక్స్ గేమ్స్‌ను తన సహచరులతో చూసినట్లు సమాచారం. అనంతరం దాదాపు 2 గంటల ప్రాంతంలో అందరితో కలిసి భోజనం చేసింది. ఆతర్వాత నిద్ర రావడంతో ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లోకి వెళ్లింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల ప్రాంతంలో ఆమె హత్యాచారానికి గురై ఉంటుందని పోలీసులు భావిస్తుస్తున్నారు. శుక్రవారం ఉదయం బాధితురాలు నగ్నంగా శవమై పడి ఉండడంతో సహచరులు భీతిల్లిపోయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..