Hindenburg Report | భారత్ మార్కెట్ పతనానికి కాంగ్రెస్ కుట్ర | హిండెన్‌బర్గ్ నివేదికపై బీజేపీ ఫైర్

Hindenburg Report | భారత్ మార్కెట్ పతనానికి కాంగ్రెస్ కుట్ర |  హిండెన్‌బర్గ్ నివేదికపై బీజేపీ ఫైర్

Hindenburg Report  | అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తాజా ఆరోపణలపై అధికార పార్టీ బిజెపి ప్రతిపక్షాలపై ధ్వ‌జ‌మెత్తింది. కాంగ్రెస్‌ పార్టీ భారతీయ స్టాక్ మార్కెట్ పతనమైపోవాలని కోరుకుంటోందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. “భారతదేశంపై ద్వేషం” సృష్టించడంలో కాంగ్రెస్ నిమగ్నమై ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఈ కుతంత్రాన్ని భారతదేశ ప్రజలు తిప్పికొట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, టూల్‌కిట్ ముఠా కలిసి భారతదేశంలో ఆర్థిక అరాచకానికి అస్థిరతకు గురిచేయాల‌ని కుట్ర పన్నాయని ఆయన మండిప‌డ్డారు.

READ MORE  Budget 2024 - Andhrapradesh : కేంద్ర బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా వరాలు

హిండెన్‌బర్గ్ నివేదిక గ‌త‌ శనివారం విడుదలైంది. సోమవారం క్యాపిటల్ మార్కెట్ అస్థిరమైందని మాజీ న్యాయ మంత్రి అన్నారు. షేర్లలో కూడా భారతదేశం సురక్షితమైన, స్థిరమైన ఆశాజనకమైన మార్కెట్ అని ఆయన అన్నారు. ‘‘మార్కెట్ సజావుగా సాగేలా చూసుకోవడం సెబీ చట్టపరమైన బాధ్యత. మార్కెట్ ను కూల‌దోసేందుకు ప్ర‌తిప‌క్షాలు నిరాధారమైన దాడి చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

రాహుల్ గాంధీని ‘సోరోస్ ఏజెంట్’ అని పిలిచిన ఆయన, హిడెన్‌బర్గ్ నివేదిక (Hindenburg Report ) భారతదేశంలో పెట్టుబడులను ఆపడానికి కాంగ్రెస్ స‌పోర్ట్ తో జరిగిన కుట్ర అని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి ప్రసాద్ మాట్లాడుతూ, భారత ప్రజలు తిరస్కరించిన తర్వాత భారతదేశంలో ఆర్థిక అరాచకానికి, అస్థిరతకు దారితీసేందుకు కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్ర పన్నిందని అన్నారు. అతను నివేదిక విడుద‌ల చ‌సిన‌ సమయాన్ని కూడా ప్రశ్నించారు. సోమవారం క్యాపిటల్ మార్కెట్లలో భయాందోళనలు రేకెత్తించేందుకు ఇదంతా సృష్టించినట్లు ఆయన తెలిపారు.

READ MORE  Fixed Deposit Rates | ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *