Independence Day 2024 | జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగురవేసిన ప్రధాన మంత్రి ఎవరు? వివరాలు
Independence Day 2024 | భారతదేశపు అతిపెద్ద జాతీయ పండుగ – స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోంది. పల్లెల నుంచి మహా నగరాల వరకు ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, సంఘాలు, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఆగస్ట్ 15 న జరగబోయే స్వతంత్ర దినోత్సవ సన్నాహాల్లో మునిగిపోయారు. దేశభక్తితో దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం మొదలైంది. తెల్లదొరల నుంచి దేశాన్ని రక్షించేందుకు స్వాతంత్ర్య దినోత్సవం సమరయోధులు, నాయకులు చేసిన అమూల్యమైన త్యాగాలను గుర్తుచేసుకునే సమయం ఇది.
దేశవ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగ, ‘తిరంగ యాత్ర’ వంటి ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంతో అంతటా సందడిగా మారింది. జూలై 28న తన నెలవారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారంలో, ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా అభియాన్ గురించి మాట్లాడారు. harghartiranga.com వెబ్‌సైట్‌లో జాతీయ జెండాతో సెల్ఫీలను అప్‌లోడ్ చేయాలని ప్రజలను కోరారు
జాతీయ జెండాను అత్యధిక సార్లు ఎగురవేసిన ప్రధానమంత్రులు వీరే..
- Independence Day 2024 : భారత ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోటపై అత్యధిక సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు. ఆగస్ట్ 15, 1947 నుంచి 1964 వరకు నిరంతరాయంగా 17 సంవత్సరాల పాటు భారత జెండాను ఆవిష్కరించారు.
- భారత ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరా గాంధీ 1966 నుండి 1977 వరకు తన రెండు పర్యాయాల పాలనలలో అలాగే 1980 నుండి 1984లో హత్యకు గురయ్యే వరకు 16 సార్లు జెండాను ఎగురవేశారు.
- ఇటీవలే మూడవసారి ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించిన భారతదేశ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 2014 నుంచి 2023 వరకు 10 సార్లు నేరుగా జాతీయ జెండాను ఎగురవేసి, తన ముందున్న మన్మోహన్ సింగ్ రికార్డును సమం చేశారు. రాబోయే ఆగస్టు 15న మన్మోహన్ సింగ్ రికార్డును ప్రధాని మోదీ బద్దలు కొట్టనున్నారు.
- 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణకు కారకులైన మన్మోహన్ సింగ్ వరుసగా 10 సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు.
- భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఐకాన్ అటల్ బిహారీ వాజ్‌పేయి 1998 నుంచి 2004 వరకు తన హయాంలో ఆరుసార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
- కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు ఎర్రకోటపై 5 సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు.
- ఉదారవాద ఆర్థిక విధానానికి నాంది పలికిన ఘనత సాధించిన కాంగ్రెస్ నాయకుడు నరసింహారావు 1991-96 కాలంలో ఎర్రకోటపై 5 సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు.
- స్వాతంత్ర్య సమరయోధులు లాల్ బహదూర్ శాస్త్రి (1964-66), మొరార్జీ దేశాయ్ (1977-79) రెండు సార్లు జాతీయ జెండాను ఎగురవేశారు.
- నలుగురు ప్రధానులు – చౌదరి చరణ్ సింగ్ (1979-80), విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (1989-90), హెచ్‌డి దేవెగౌడ (1996-97), ఇందర్ కుమార్ గుజ్రాల్ (1997-98) వారి పాలనలో ఒక్కసారి మాత్రమే జెండాను ఆవిష్కరించారు.
- అయితే ఇద్దరు ప్రధానులు గుల్జారీలాల్ నందా, చంద్ర శేఖర్ వారి పదవీకాలంలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం ఎప్పుడూ రాలేదు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..