Indian Americans | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో భారీ నిరసన
Indian Americans | బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలపై ఇస్లామిస్ట్ తీవ్రవాదులు చేస్తున్న భయంకరమైన హింసను నిరసిస్తూ హ్యూస్టన్‌లోని షుగర్ ల్యాండ్ సిటీ హాల్‌లో 300 మందికి పైగా భారతీయ అమెరికన్లు బంగ్లాదేశ్ మూలాల హిందువులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు.బంగ్లాదేశ్‌లో బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్న మైనారిటీ కమ్యూనిటీలను రక్షించడానికి, వీరిపై దురాగతాలను నివారించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈవెంట్ నిర్వాహకులు బిడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను కోరారు. హిందూ జనాభాపై ఇటీవలి తీవ్రతరమవుతున్న హింస మరింత ముప్పును తీసుకువచ్చే ప్రమాదముంది. బంగ్లాదేశ్‌లోని అన్ని మతపరమైన మైనారిటీల రక్షణ, భద్రతను పెంచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు, మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఈ ఘోరమైన నేరాలు కొనసాగుతున్న తరుణంలో US ప్రభుత్వం చూస్తూ ఊరుకోవద్దని డిమాండ్ చేశారు.
“సేవ్ హిందువులను...