
అక్రమ బంగ్లాదేశ్ వలస విద్యార్థులను గుర్తించండి.. ఢిల్లీ పాఠశాలలకు ఆదేశాలు
Bangladeshi migrant students : అక్రమ బంగ్లాదేశ్ వలస పిల్లలను గుర్తించి, వారికి జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా చూసుకోవాలని పాఠశాలలను మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఆదేశించింది.బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను గుర్తించాలని ఢిల్లీ LG సెక్రటేరియట్ సూచించిన కొన్ని రోజుల తర్వాత తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార AAP, BJP మధ్య వాగ్యుద్ధం మొదలైంది.అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ఆక్రమణలను తొలగించాలని పౌర సంఘం అన్ని MCD జోన్‌లను ఆదేశించింది. డిసెంబరు 31లోగా ఎంసీడీ డిప్యూటీ కమిషనర్ ద్వారా యాక్షన్ టేకప్ రిపోర్ట్‌ను కోరింది."మునిసిపల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇస్తున్నప్పుడు అక్రమ బంగ్లాదేశీ (Bangladesh) వలసదారులను గుర్తించడానికి విద్యా శాఖ తగిన నివారణ చర్యలు తీసుకుంటుంది. పాఠశాలల్లో అక్రమ బంగ్లాదేశ్ వలస పిల్లలను గుర్తించడానికి సరైన గుర్తింపు, ధ...