
Bangladesh Crisis 2024 | బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ ఉద్రికత్తల మధ్య, ఆ దేశం మరో సవాలును ఎదుర్కొంటోంది. ఇస్లామిక్ కాలిఫేట్‌ను తిరిగి స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా షరియాను అమలు చేయాలని కోరుకునే ఒక ఛాందసవాద రాజకీయ సంస్థ అయిన హిజ్బ్ ఉత్-తహ్రీర్ (HuT) ప్రభావం వేగంగా పెరుగుతోంది.
అనేక దేశాలలో నిషేధించబడిన HuT ను గబంగ్లాదేశ్‌లో కూడా అక్టోబర్ 9న బ్యాన్ చేశారు. అయితే ఈ సంస్థ మద్దతుదారుల (ఢాకాతో సహా) ర్యాలీలు చేస్తుండడంతోపాటు సంస్థ భావజాలాన్ని ప్రచారం చేసే పోస్టర్‌లు ఇప్పుడు అక్కడక్కడా వెలుస్తుండడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.
“హిజ్బ్ ఉత్-తహ్రీర్ అనేది పాపులర్ అయిన విద్యావంతులను కలిగి ఉన్న సంస్థ. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని సమాజంలోని అన్ని వర్గాలలోనూ వారి ప్రభావం ఉంది” అని ఢాకాకు చెందిన ఒక ప్రొఫెసర్ మీడియాతో చెప్పారు.
ఆగష్టు 9న, HuT మద్దతుదారులు ఢాకాలోని బైతుల్ ముకర్రం నార్త్ గేట్ వద్ద ర్యాలీని నిర్వహించారు. అంతటితో కాకుండా బంగ్లాదేశ్‌లోని పౌరులందరికీ నిజమైన న్యాయం, సంక్షేమం అందించే షరియా చట్టం ఆధారంగా బంగ్లాదేశ్‌లో ఖలీఫాను స్థాపించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుంఆడ వారు విదేశీ కంపెనీలను తరిమికొట్టాలని, ముస్లిమేతర దేశాలతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలను రద్దు చేయాలని కూడా పిలుపునిచ్చారు.
“HUT సైన్యంలో సానుభూతిపరులను కలిగి ఉన్నందున తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించరు, లింగ సమానత్వ హక్కులకు వ్యతిరేకం, కాబట్టి మహిళలు చాలా ఆందోళన చెందవలసి ఉంటుంది” అని ఢాకాకు చెందిన నివేదిక చెబుతోంది. అయితే చైనా, రష్యా, పాకిస్తాన్, జర్మనీ, టర్కీ, UK, కజాఖ్స్తాన్, మధ్య ఆసియా, ఇండోనేషియాలో HuT ను నిషేధించారు. లెబనాన్, యెమెన్, UAE వంటి అరబ్ దేశాలలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇదిలా ఉండగా.. భారతదేశంలో కూడా తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న ఒక HuT కార్యకర్తలను అరెస్టు చేశారు. చాలా మంది కార్యకర్తలు విద్యావంతులు, విద్యార్థుల ద్వారా తమ ప్రచారాన్ని విస్తృతం చేస్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యకర్తలను అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌లో హుట్ ఉద్యమం తీవ్రరూపం దాల్చితే, భారతదేశంలోని అజ్ఙాతంలో ఉన్న కార్యకర్తలు బంగ్లాదేశ్‌తో సమన్వయం చేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా భారత్‌లో కూడా దాని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
బ్రిటీష్ పార్లమెంట్ జనవరిలో అప్పటి బ్రిటిష్ హోమ్ సెక్రటరీ, జేమ్స్ క్లీవర్లీ, టెర్రరిజం చట్టం 2000 ప్రకారం.. HuTని నిషేధించేందుకు రూపొందించిన ముసాయిదాను క్లియర్ చేసింది. దీనర్థం ఈ గ్రూప్‌తో ఏదైనా లింక్ ఉన్నా కూడా క్రిమినల్ నేరం అవుతుంది.
Bangladesh Crisis 2024 ఆగస్ట్ 9న, HuT మద్దతుదారులు ఢాకాలోని బైతుల్ ముకర్రం నార్త్ గేట్ వద్ద ర్యాలీ నిర్వహించారు. షరియా చట్టం ఆధారంగా బంగ్లాదేశ్‌లో ఖలీఫాను స్థాపించాలని డిమాండ్ చేశారు. ఇది పౌరులందరికీ “నిజమైన న్యాయం, సంక్షేమం”ని నిర్ధారిస్తుంది. వారు విదేశీ సంస్థలను బహిష్కరించాలని, ముస్లిమేతర రాష్ట్రాలతో వ్యూహాత్మక ఒప్పందాలను రద్దు చేయాలని కూడా పిలుపునిచ్చారు.
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.