Vishakhapatnam: గత వారం అదృశ్యమైన హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థి కార్తీక్(21) మంగళవారం విశాఖపట్నంలోని బీచ్ లో శవమై కనిపించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన రైతు, చిరువ్యాపారి అయిన ఉమ్లా నాయక్ కుమారుడు.. కార్తీక్ ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్-మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. 17న తండ్రి ఉమ్లా నాయక్ ఫోన్ చేసినా కార్తీక్ లిఫ్ట్ చేయలేదు.
అయితే అతని మృతదేహాన్ని విశాఖ బీచ్ లో గుర్తింంచారు. కాగా అతడు ఆత్మహత్య చేసుకోవడంతో మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.
అంతకుముదు కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఐఐటీ అధికారుల నుంచి సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు జూలై 19న ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకుని సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, విద్యార్థి కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో సోదాలు చేయగా ఆచూకీ లభించలేదు.. విచారణలో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మొబైల్ ఫోన్ సిగ్నల్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. కార్తీక్ తల్లిదండ్రులతో పాటు పోలీసుల బృందం విశాఖపట్నం బయలుదేరింది. విద్యార్థి స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఐఐటీ హైదరాబాద్ సంగారెడ్డి జిల్లా కందిలో ఉంది.