Hyderabad Rains | హైదరాబాద్: ఈ వేసవిలో మునుపెన్నడూ లేనివిధంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10దాటితే చాలు అడుగు బయటపెట్టాలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లో భానుడు సెగలు కక్కుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే ఎండలతో తల్లడిల్లిపోతున్న హైదరాబాద్ (Hyderabad Rains) వాసులకు కూల్ కూల్ న్యూస్ చేప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో 24గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ రానున్న 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తాజా వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీలకు పడిపోవచ్చని అంచనా వేసింది. అయితే అన్ని జిల్లాలకు వర్ష సూచన లేదని తెలుస్తోంది. ఆదివారం కరీంనగర్, జగిత్యాల, ములుగు, నల్లగొండ జిల్లాల్లో సుమారు 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హైదరాబాద్ చార్మినార్ ఏరియాలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భాగ్యనగరంలోని బహదూర్‌పురా, షేక్‌పేట్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, ముషీరాబాద్, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, బండ్లగూడ, సైదాబాద్, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..