Home » 1947 దేశ విభజన తర్వాత కాశ్మీర్‌లోని శారదా మందిర్‌లో తొలిసారిగా నవరాత్రి పూజలు
Kashmir

1947 దేశ విభజన తర్వాత కాశ్మీర్‌లోని శారదా మందిర్‌లో తొలిసారిగా నవరాత్రి పూజలు

Spread the love

Kashmir : జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ (LOC) సమీపంలోని శారదా మందిర్‌(Sharda Mandir )లో 1947 తర్వాత మొట్టమొదటిసారిగా నవరాత్రి పూజలు జరుగుతున్నాయి.
ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని తీత్వాల్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఈ పూజలో పలువురు కాశ్మీరీ పండిట్‌లతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు.
ఈ ఆలయం 1947 దాడుల్లో ధ్వంసమైంది. దేశ విభజనకు ముందు రోజులలో ఉన్న అదే నిర్మాణ శైలిలో, అదే స్థలంలో పునర్నిర్మించబడింది. ఈ ఏడాది మార్చి 23న నవేరి- కాశ్మీరీ కొత్త సంవత్సరం సందర్భంగా, అలాగే జూన్‌లో శారదా దేవి విగ్రహానికి అభిషేకం, ప్రాణ-ప్రతిష్ట జరిగినప్పడు ఆలయాన్ని తెరిచారు.

ఇక దసరాను పురస్కరించుకొని శారదా మందిర్‌లో అక్టోబర్ 15 నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) మాట్లాడుతూ.. ఈ ఆలయంలో పూజలు నిర్వహించడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆధ్యాత్మిక సాంస్కృతిక జ్వాల పునరుజ్జీవం జరిగినట్లైందని తెలిపారు. ‘‘1947 తర్వాత తొలిసారిగా ఈ ఏడాది కాశ్మీర్‌ (Kashmir )లోని చారిత్రాత్మక శారదా ఆలయంలో నవరాత్రి పూజలు నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన విషయం. అంతకు ముందు చైత్ర నవరాత్రి పూజలు నిర్వహించి ఇప్పుడు ఈ మందిరంలో శారదియ నవరాత్రి పూజ మంత్రాలతో ప్రతిధ్వనిస్తుంది. పునరుద్ధరణ తర్వాత 23 మార్చి 2023న ఆలయాన్ని తిరిగి తెరవడం నా అదృష్టం” అని షా అన్నారు.

READ MORE  Jagannath Rath Yatra | జగన్నాధ రథయాత్ర సన్నద్ధం.. రెండ్రోజులు సెలవు ప్రకటించిన ఒడిశా

Kashmir sharda-Peeth

మార్చి 203ః23లో ప్రారంభం

సేవ్ శారదా కమిటీ వ్యవస్థాపకుడు రవీంద్ర పండిత కూడా దసరాతో ముగిసే 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజున నవరాత్రి పూజకు హాజరయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో శారదా పీఠాన్ని పునఃప్రారంభించడమే అంతిమ లక్ష్యం అని పండిత దానిని చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నాడు.
2023 మార్చిలో పునరుద్ధరణ ,పునర్నిర్మాణం తర్వాత అమిత్ షా ఈ ఏడాది మార్చిలో శారదా ఆలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులను ఉద్దేశించి షా మాట్లాడుతూ శారదా పీఠం భారతదేశ సాంస్కృతిక, మత, విద్యా వారసత్వానికి కేంద్రంగా ఎలా ఉందో గుర్తుచేసుకున్నారు. శారదా పీఠం.. గ్రంధాల ప్రకారం ఆలయ నిర్మాణం జరిగిందని చెప్పారు. కర్తార్‌పూర్ కారిడార్ తరహాలో శారదా పీఠాన్ని తెరిచేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

READ MORE  Manipur violence : మణిపూర్‌ వైరల్ వీడియో రికార్డు చేసిన వ్యక్తి అరెస్ట్

కశ్మీరీ పండిట్ల ఆరాధ్య దైవం

శారదా దేవత, సాధారణంగా సరస్వతి అని పిలుస్తారు. కాశ్మీరీ పండిట్‌ల రోజువారీ ఆరాధనలో భాగంగా అమ్మవారిని కొలుస్తారు. శారదా ఆలయం సరిహద్దు ప్రాంతంలోని మూడు సూత్రాల పుణ్యక్షేత్రాలలో ఒకటి. మిగిలిన రెండు మార్తాండ్ సూర్య దేవాలయం, అమర్‌నాథ్ దేవాలయం. సరస్వతిని కాశ్మీరీ పండితులు కుల్దేవి (ప్రధాన దేవత) అని పిలుస్తారు, శారదా పీఠ్ సముద్ర మట్టానికి 1,981 మీటర్ల ఎత్తులో పీఓకేలోని హర్ముఖ్ పర్వతం లోయలో ఉంది.

READ MORE  BJP on Reservation | కాంగ్రెస్ ను ఇరుకునపెట్టేలా బీజేపీ తాజా ప్రకటన..

 

ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లో ఫాలో కండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..