Friday, February 14Thank you for visiting

Delhi Election 2025 : నేడు ఢిల్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల

Spread the love

Delhi Election 2025 Schedule Live : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో నేటి నుంచి ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అమలులోకి రానుంది. ఢిల్లీలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా మూడోసారి పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈసారి ఎలాగైనా నిలువ‌రించాల‌ని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంది. కానీ గ‌త‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తో మిత్ర‌ప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది.

READ MORE  TTD Chairman Members | టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. పాలక మండలి సభ్యుల వివరాలు ఇవీ..

2020లో ఢిల్లీ ఎన్నికలు జనవరి 6న ప్ర‌క‌టించారు. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. అవినీతి కేసులో బెయిల్ లభించడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ముమ్మ‌రంగా ప్రచారం చేస్తోంది. ప్రజాకోర్టు తీర్పులో తమ పార్టీ విజయం సాధిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.

Delhi Election 2025 ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం, ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు, వీరిలో 18-19 సంవత్సరాల వయస్సు గల 2.08 లక్షల మంది మొదటి సారి ఓటర్లు ఉన్నారు.

READ MORE  Rapido VOTENOW offer | సీనియర్ సిటిజన్‌లు, దివ్యాంగ ఓటర్లకు రాపిడో ఉచిత రైడ్స్..  ఓటు వేస్తే ఉచితగా దోసె

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..