Delhi Election 2025 : నేడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Delhi Election 2025 Schedule Live : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో నేటి నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది. ఢిల్లీలో, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా మూడోసారి పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఈసారి ఎలాగైనా నిలువరించాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉంది. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తో మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తోంది.2020లో ఢిల్లీ ఎన్నికలు జనవరి 6న ప్రకటించారు. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. అవినీతి కేసులో బెయిల్ లభించడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ప్రజాకోర్టు తీర్పులో తమ పార...