Atishi | ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి.. భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇదే..
Delhi| ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ వీడింది. అంతా ఊహించినట్లుగానే రాష్ట్ర మంత్రి అతిశీ (Atishi Marlena )ని కొత్త సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. ఈరోజు సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ఢిల్లీ సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు. కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలందరూ ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభా పక్ష నాయకురాలిగా అతిశీ ఎన్నికయ్యారు.ఇదిలా ఉండగా మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కాగా, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత శుక్రవారం తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగిస్తూ రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహి...