Sunday, October 13Latest Telugu News
Shadow

Atishi | ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి.. భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇదే..

Delhi| ఢిల్లీకి కాబోయే సీఎం ఎవర‌నేదానిపై స‌స్పెన్స్ వీడింది. అంతా ఊహించినట్లుగానే రాష్ట్ర‌ మంత్రి అతిశీ (Atishi Marlena )ని కొత్త సీఎంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. ఈరోజు సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వ‌హించారు. ఇందులో ఢిల్లీ సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు. కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలంద‌రూ ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభా పక్ష నాయకురాలిగా అతిశీ ఎన్నికయ్యారు.

ఇదిలా ఉండ‌గా మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కాగా, సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో గ‌త‌ శుక్రవారం తీహార్‌ జైలు నుంచి ఆయ‌న‌ విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్‌ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ప్రసంగిస్తూ రెండు రోజుల్లో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి త‌దుప‌రి సీఎం ను ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. కాగా ఈరోజు సాయంత్రం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయ‌నున్నారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అపాయింట్‌మెంట్‌ను కోరగా మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు టైం ఇచ్చారు. దీంతో కేజ్రీవాల్ ఆయ‌న‌ను కలిసి తన రాజీనామా ప‌త్రాన్ని సమర్పించనున్నారు. ఆ వెంటనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దావా వేయనున్న‌ట్లు స‌మాచారం.

READ MORE  PM KISAN Scheme : జూన్ 18న వారణాసిలో పీఎం కిసాన్ పథకం కింద రూ.20,000 కోట్లు విడుదల

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో కేజ్రీవాల్ జైలులో ఉన్న స‌మ‌యంలో అతిశీ ముందుండి ఉద్య‌మాలు చేప‌ట్టారు. ప్రభుత్వ బాధ్యతలను కూడా నిర్వ‌ర్తించారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న అతీశి.. కేబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలను కూడా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇందులో విద్య, ఆర్థికం, ప్లానింగ్‌ , పీడబ్ల్యూడీ, వాటర్, పవర్, పౌర సంబంధాలు వంటి కీలక శాఖలను అతిశీ వ‌ద్దే ఉన్నాయి. ఎడ్యుకేషన్‌పై వేసిన స్టాండింగ్ కమిటీకి ఆమె చైర్ పర్సన్‌గానూ పనిచేశారు. పాల‌న ప‌ర‌మైన అనుభ‌వం కార‌ణంగా ఆమెను సీఎంగా ప్ర‌క‌టించిన‌ట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.

READ MORE  Delhi Liquor Scam | దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మరో మంత్రికి ఈడీ సమన్లు ​​జారీ

అతిషి (Atishi Marlena) ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన మూడవ మహిళ. భారతీయ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో 17వ మహిళా ముఖ్యమంత్రిగా అతిశి నిలిచారు. వివిధ రాష్ట్రాల్లో సీఎం పీఠాన్ని అధిష్టించిన మహిళలను ఒక్కసారి చూద్దాం.

భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా..

List of women chief ministers

  • సుచేతా కృప్లానీ (ఉత్తర ప్రదేశ్): 1963 నుండి 1967 వరకు
  • నందిని సత్పతి (ఒడిశా): 1972 నుండి 1976 వరకు
  • శశికళ కకోద్కర్ (గోవా): 1973 నుండి 1979 వరకు
  • సయ్యదా అన్వారా తైమూర్ (అస్సాం): 1980 నుండి 1981 వరకు
  • జానకీ రామచంద్రన్ (తమిళనాడు): 1988
  • జయరామ్ జయలలిత (తమిళనాడు): 1991 నుండి 1996, 2001, 2002 నుండి 2006, 2011 నుండి 2014, 2015 నుండి 2016 వరకు
  • మాయావతి (ఉత్తర ప్రదేశ్): 1995, 1997, 2002-2003, 2007 నుండి 2012 వరకు
  • రాజిందర్ కౌర్ భట్టల్ (పంజాబ్): 1996 నుండి 1997 వరకు
  • రబ్రీ దేవి (బీహార్): 1997 నుండి 1999, 1999 నుండి 2000, 2000 నుండి 2005 వరకు
  • సుష్మా స్వరాజ్ (ఢిల్లీ): 1998
  • షీలా దీక్షిత్ (ఢిల్లీ): 1998 నుండి 2013 వరకు
  • ఉమాభారతి (మధ్యప్రదేశ్): 2003 నుండి 2004 వరకు
  • వసుంధర రాజే సింధియా (రాజస్థాన్): 2003 నుండి 2008, 2013 నుండి 2018
  • మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్): 2011 నుండి ఇప్పటి వరకు
  • ఆనందీబెన్ పటేల్ (గుజరాత్): 2014 నుండి 2016 వరకు
  • మెహబూబా ముఫ్తీ (జమ్మూ కాశ్మీర్): 2016 నుండి 2018 వరకు
READ MORE  Water Crisis | ఢిల్లీలో తీవ్రమైన నీటి సంక్షోభం, ట్యాంకర్ల వ‌ద్ద ప్ర‌జ‌ల‌పై పెనుగులాట

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్