Home » Current Bill Payment | కరెంటు బిల్లులు చెల్లించేవారికి అలర్ట్.. డిస్కమ్ కీలక సూచనలు..
TGSPDCL Current Charges

Current Bill Payment | కరెంటు బిల్లులు చెల్లించేవారికి అలర్ట్.. డిస్కమ్ కీలక సూచనలు..

Spread the love

హైదరాబాద్: విద్యుత్ వినియోగ‌దారుల‌కు టీజీఎస్‌పీడీసీఎల్ కీల‌క సూచ‌న‌లు చేసింది. క‌రెంటు బిల్లులు చెల్లించేవారు ఆర్‌బిఐ ఆదేశాల మేర‌కు ఫోన్ పే, గూగుల్ పే, అమేజాన్ పే ద్వారా క‌రెంటు బిల్లుల చెల్లింపుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Current Bill Payment | తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ విద్యుత్ బిల్లులను బ్యాంకులు నిలిపివేయడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించ‌డం సాధ్య‌ప‌డ‌దు.

అయితే, విద్యుత్ వినియోగ‌దారులు తమ క‌రెంటు బిల్లులను TGSPDCL వెబ్‌సైట్, లేదా దాని మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చు. TGSPDCL అధికారిక ‘X’ హ్యాండిల్ ద్వారా ఈ విష‌యాన్ని ప్రకటించింది. అలాగే వినియోగదారులు తమ బిల్లులను కంపెనీ బిల్లుల చెల్లింపు కేంద్రాల ద్వారా కూడా చెల్లించవచ్చు.

READ MORE  ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జగిత్యాల నుంచి ముంబై ట్రెయిన్

హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో అదానీ గ్రూప్ విద్యుత్ బిల్లులు వసూలు చేయనుంది.
RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) జూలై 1 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు చెందిన‌ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారా థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను రూట్ చేయడం తప్పనిసరి చేసింది. అయితే CRED, PhonePe వంటి యాప్‌లు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. BBPS, HDFC, ICICI, Axis బ్యాంక్ వంటి ప్రధాన క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థలు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను స్వీకరించేందుకు BBPS ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రాలేదు.

READ MORE  రాస్ట్రంలో త్వ‌ర‌లో ఎయిర్ అంబులెన్స్‌లు..

అయితే SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, RBL బ్యాంక్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జారీ చేసిన క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉన్న వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు BBPS ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంటాయి కాబట్టి వినియోగదారులు ఈ థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపు (Current Bill Payment) లను కొనసాగించవచ్చు.
ఆసక్తికరమైన విష‌య‌మేంటంటే.. క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి అధికారం పొందిన 34 బ్యాంకులలో, 26 ఇంకా BBPSలో క్రియాశీలకంగా లేవు. బిల్లుల చెల్లింపులన్నీసెంట్ర‌లైజ్డ్ కావాలంటూ ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇది పేమెంట్ ట్రెండ్‌ల గురించి స్పష్టతను ఇస్తుంది. మోసాలను ట్రాక్ చేయడానికి అలాగే నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది.

READ MORE  Transfers In Telangana | రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..