Home » Clay Ganesha | హైదరాబాద్ లో మ‌ట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం
Clay Ganesha

Clay Ganesha | హైదరాబాద్ లో మ‌ట్టి వినాయక విగ్రహాల పంపిణీకి సిద్ధం

Spread the love

హైదరాబాద్ : గణేష్ చతుర్థి సమీపిస్తున్న త‌రుణంలో హైదరాబాద్‌లో పండుగ సందడి తార స్థాయికి చేరుకుంది. చిన్న మట్టి విగ్రహాల ( Clay Ganesha) నుంచి.. భారీ విగ్ర‌హాల వ‌ర‌కు రోడ్ల‌పై క‌నువిందు చేస్తున్నాయి. వ‌ర్షం కురుస్తున్నా కూడా గణేశ విగ్రహాలను డ‌ప్పు చ‌ప్పుళ్ల మ‌ధ్య‌ ఊరేగింపుల‌తో మండ‌పాల వ‌ద్ద‌కు త‌ర‌లిస్తున్నారు.

ఖైర‌తాబాద్ లో 70 అడుగుల భారీ విగ్ర‌హం..

Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో 70 ఏళ్ల పండుగ సంప్రదాయానికి గుర్తుగా 70 అడుగుల ఎత్తులో ఆకట్టుకునేలా చరిత్రలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక‌ మార్కెట్లలో కూడా గ‌ణ‌ప‌తి విగ్ర‌మాల క్ర‌య విక్ర‌యాల‌తో సందడి నెల‌కొంది. అయితే పెరుగుతున్న పర్యావరణ అవగాహనకు ప్రతిస్పందనగా, అనేక మంది మట్టి, సహజ రంగులతో తయారు చేసిన చిన్న గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తుండడం కనిపిస్తోంది. మట్టి విగ్రహాలు విక్రయించే స్టాళ్ల వద్ద జనం కిక్కిరిసిపోతున్నారు. స్థిరమైన ప్రత్యామ్నాయాల కోసం డిమాండ్‌ను పెంచుతున్నారు, ఆవు పేడతో చేసిన విగ్రహాలకు కూడా ఆదరణ లభిస్తోంది.

READ MORE  Hyderabad New Metro Stations | హైదరాబాద్ లో మరో 13 కొత్త మెట్రో స్టేషన్లు.. ఎక్కడెక్కడో తెలుసా.. ?

నిమజ్జన ప్రక్రియలో నీటి కాలుష్యాన్ని నివారించడానికి కొంతమంది పెద్ద సైజులో ఉన్న మ‌ట్టి విగ్ర‌హాల‌ను ఎంచుకుంటున్నారు. అనేక పండళ్ల నిర్వాహ‌కులు మట్టి విగ్రహాలకు ఓటేస్తున్నారు.

హైద‌రాబాద్ లో 3.10 ల‌క్ష‌ల విగ్ర‌హాల పంపిణీ

పర్యావరణ అనుకూల విగ్రహాల (Clay Ganesha Idols) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) 3.10 లక్షల మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా నగరవ్యాప్తంగా ఒక్కొక్కటి లక్ష మట్టి విగ్రహాలను అందజేస్తున్నాయి.

READ MORE  రాష్ట్రంలో భారీ వర్షాలతో 16 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

 

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..