
Char Dham Yatra | ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్ర హిందువులకు పవిత్రమైనంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర కోసం అసంఖ్యాకమైన భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. యమునోత్రి (Yamumotri), గంగోత్రి (Gangotri), కేదార్‌నాథ్, బద్రీనాథ్ (Badrinath) పుణ్యక్షేత్రాలను తిలకించేందుకు దేశంలోని నలుమూలల నుంచి వస్తుంటారు. కాగా కేదార్‌నాథ్ (Kedarnath), గంగోత్రి యమునోత్రి ఆలయాలు శుక్రవారం భక్తుల కోసం తెరవబడ్డాయి. గర్హ్వాల్ హిమాలయాలలో నెలకొని ఉన్న ఈ ఆలయాలు ఏటా మంచు దుప్పట్లు కప్పివేస్తాయి. వేసవి రాకతో మాత్రమే తిరిగి తెరవబడతాయి.
Char Dham Yatra షెడ్యూల్ ..
Char Dham Yatra schedule : ఆలయ కమిటీ అధికారులు రీ ఓపెన్ షెడ్యూల్‌ను ప్రకటించారు. కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలు ఉదయం 7 గంటలకు తెరవనుండగా, గంగోత్రి ఆలయం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరుస్తారు. ఉత్తరాఖండ్ ‘చర్ధమ్ యాత్ర’లో భాగమైన బద్రీనాథ్ మే 12వ తేదీన ఉదయం 6 గంటలకు తెరవనున్నారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్‌ను 20 క్వింటాళ్ల పూలతో అలంకరిస్తున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) మీడియా ఇంచార్జి హరీష్ గౌర్ మీడియాకు తెలిపారు.
భక్తులకు స్వాగతం
కాగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా చార్ధామ్ యాత్రకు వచ్చిన భక్తులకు స్వాగతం పలికారు. “ఈరోజు, అక్షయ తృతీయ సందర్భంగా, కేదార్‌నాథ్ ధామ్, యమునోత్రి ధామ్, గంగోత్రి ధామ్ భక్తుల దర్శనం కోసం అనుమతించనున్నామని తెలిపారు. చార్ధామ్ యాత్రకు భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలిపారు.
ప్రకృతి రమణీయ దృశ్యాలు
ఈ విగ్రహం భక్తుల కోసం ఆలయాన్ని తెరిచేముందు ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహాన్ని చెప్పులు లేని BKTC వాలంటీర్లు ప్రతి సంవత్సరం ఉఖిమఠ్ నుండి కేదార్‌నాథ్ వరకు తమ భుజాలపై మోస్తారు. దేశంతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొంటారని మీడియా ఇంచార్జి హరీష్ గౌర్ తెలిపారు. ఇదిలా ఉండగా, హిమాలయ దేవాలయాల కోసం 4,050 మంది చార్‌ధామ్ యాత్రికులతో 135 వాహనాలను గురువారం రిషికేశ్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. యాత్ర సన్నాహకాలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు, దేశం నలుమూలల నుండి అలాగే విదేశాల నుంచి కూడా భక్తులు హిమాలయాల పాదాలకు చేరుకుంటారు. ఎత్త్తైన పర్వతాలు నిర్మలమైన ప్రకృతి దృశ్యాలను చూసి తన్మయత్వంతో భక్తిపారవశ్యంతో మునిగిపోతారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..