LPG Price Hike | భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు!

● గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 60, వాణిజ్య సిలిండర్‌పై రూ. 115 పెంపు ● నేటి నుంచే (మార్చి 7) అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు ● ఇంధన కొరత లేదన్న కేంద్ర మంత్రి.. పుకార్లను నమ్మవద్దన్న ఇండియన్ ఆయిల్ LPG Price Hike | న్యూఢిల్లీ: సామాన్యుడి వంటింటి బడ్జెట్‌పై మరోసారి భారం పడింది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ (LPG) సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. శనివారం (మార్చి 7, … Read more

Social Media Ban | పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఏపీ, కర్ణాటక నిషేధం: పూర్తి వివరాలు!

Social Media Ban

Social Media Ban | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల్లో స్క్రీన్ వ్యసనాన్ని అరికట్టడానికి ఒక సాహసోపేతమైన అడుగు వేస్తోంది. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను అస్సలు ఉపయోగించలేరని ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కొత్త నియమం త్వరలో అమలు కానుంది. రాబోయే మూడు నెలల్లో (90 రోజులు) దశలవారీగా అమలు చేయనున్నారు. ప్రస్తుతానికి 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని … Read more

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా నాంపల్లి స్టేషన్​ : రూ. 350 కోట్లతో కొత్త రూపు – Nampally Railway Station

Nampally Railway Station

హైదరాబాద్ నగరంలోని అత్యంత ప్రాధాన్యమైన నాంపల్లి (Nampally Railway Station ) రైల్వే స్టేషన్ త్వరలో సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులతో కలిసి స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో రైల్వే రంగంలో ఒక అపూర్వ విప్లవం కొనసాగుతోందని పేర్కొన్నారు. Nampally Railway Station : అత్యాధునిక హంగులతో రీ-డెవలప్‌మెంట్ భవిష్యత్తు … Read more

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు: ప్రపంచ శాంతికి RSS పిలుపు

RSS Mohan Bhagwat

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మంటలు రేగుతున్న తరుణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అంతర్జాతీయ శాంతిని కాంక్షిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. యుద్ధాలు ఎప్పుడూ స్వార్థపూరిత కారణాల కోసం కాకుండా, కేవలం మానవత్వం, సత్యం యొక్క రక్షణ కోసమే జరగాలని సంఘ్ స్పష్టం చేసింది. మానవత్వం కోసమే పోరాటం: సునీల్ అంబేకర్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ (RSS) జాతీయ ప్రచార, మీడియా విభాగం అధిపతి సునీల్ అంబేకర్ ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతిపై … Read more

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? ఇరాన్‌పై దాడుల ప్రభావం భారత్‌పై ఎంత? ‌‌ – Petrol Diesel Price Hike India

Petrol Diesel Price Cut India 2026

Petrol Diesel Price Hike India | ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై తీవ్రంగా పడింది. గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా 9-10% మేర పెరిగాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $80కి చేరువలో ఉండగా, అమెరికా క్రూడ్ ఫ్యూచర్స్ 8.6 శాతం పెరిగి $72.79 వద్ద కొనసాగుతోంది. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 88% దిగుమతులపైనే … Read more

Chandra Grahanam | మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌లో ‘బ్లడ్ మూన్’ దర్శనం – నగరాల వారీ సమయాలు ఇవే

Chandra Grahanam

Chandra Grahanam | మార్చి 3, 2026న ఈ సంవత్సరంలోని మొదటి ప్రధాన ఖగోళ సంఘటన జరగబోతోంది. గత నెలలో జరిగిన సూర్యగ్రహణం భారత్‌లో కనిపించకపోవడంతో, ఈసారి కనిపించే చంద్రగ్రహణం (Chandra Grahan) పై ఖగోళ పరిశీలకుల్లో ఉత్సాహం నెలకొంది. ఈసారి చంద్రగ్రహణం భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి కనిపించనుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన సమయాలు ఇలా ఉన్నాయి: Chandra Grahan వివరాలు సమయం (IST) గ్రహణం ప్రారంభం మధ్యాహ్నం 03:20 చంద్రోదయం (భారత్‌లో) సాయంత్రం 06:26 … Read more

TTD Latest News | రేపు తిరుమల ఆలయం మూసివేత.. అన్ని దర్శనాలు రద్దు – 83,122 మంది భక్తుల రద్దీ మధ్య కీలక నిర్ణయం

Tirumala Tickets Booking

భక్తులకు ముఖ్య గమనిక.. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు. అన్ని రకాల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. TTD Latest News : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం తలుపులను మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేయనున్నారు. రద్దైన దర్శనాలు సోమవారం రాత్రి వరకు … Read more

RSS Shakha Sangamam | కాశిబుగ్గలో అంబరాన్నంటిన ‘ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం’

RSS Shakha Sangamam

వరంగల్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది వేడుకల్లో భాగంగా కాశిబుగ్గ నగర్​ ‘శాఖల సంగమం’ (RSS Shakha Sangamam) కార్యక్రమం ఆదివారం ఉదయం అత్యంత క్రమశిక్షణతో, ఉత్సాహభరితంగా సాగింది. కాశిబుగ్గ నగర్​ పరిధిలోని ఎల్​బినగర్​, తిలక్​బస్తీ, అబ్బనికుంట, సొసైటీకాలనీ, కోటిలింగాల బస్తీ, ధర్మారం, మొగిలిచర్ల బస్తీలకు చెందిన‌ శాఖలు ఓసిటీ హనుమాన్ దేవాలయం ముందున్న మైదానంలో ఏకమై, సమష్టిగా శాఖ‌లు, సామూహిక క్రీడ‌లు, ఆట‌పాట‌లు, ప్రార్థన నిర్వహించాయి. ఈ అపురూప దృశ్యమాలిక స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. … Read more

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం: అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌లో సంచలనం! – Iran Supreme Leader Khamenei Dead

Iran Supreme Leader Khamenei Dead

Iran Supreme Leader Khamenei Dead : మధ్యప్రాచ్యం రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పే భారీ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అగ్రనేత, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (86) అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆదివారం తెల్లవారుజామున అధికారికంగా ధృవీకరించింది. ఖమేనీ మరణవార్త వెలువడిన వెంటనే ఇరాన్ అంతటా 40 రోజుల పాటు సంతాప దినాలను, ఏడు రోజుల పాటు జాతీయ … Read more

Samalkota Fire Accident : బాణాసంచా కేంద్రంలో పేలుడు.. 20 మంది దుర్మరణం!

Samalkota Fire Accident

కాకినాడ : కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం (Samalkota Fire Accident) చోటుచేసుకుంది. వేట్లపాలెం (Vetlapalem) పరిధిలోని గోదావరి కెనాల్ పక్కన ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు మహిళలే ఉండటం గమనార్హం. యుద్ధ క్షేత్రాన్ని తలపించిన ఘటనాస్థలి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా … Read more