Rythu runa Mafi | రుణ మాఫీ కోసం ఎంతో కాలంగా రైతులు ఎదురుచూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. దీంతో విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఇటీవల లోక్ సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. తాజాగా ఉపముఖ్యమత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka ) రుణమాఫీ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా రూ 2 లక్షల రైతు రుణమాఫీ (Rythu runa Mafi ) ఆగస్టు నెలకు ముందే అమలు చేసి తీరుతామని ఈ పథకాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా అమలుపై కూడా చర్చలు జరుగుతున్నాయని రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి? అన్నది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని, విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అర్హులైన రైతులకు అందజేస్తామని తెలిపారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుందని చెప్పారు. కొత్తగూడెంలో గురువారం తాగునీరు, రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పొంగులేటి శ్రీవాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి పాల్గొని శంకుస్థాన చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రూ 42 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారని, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారని, అయినా ఇంటింటికి తాగునీటిని అందించలేకోతున్నారని విమర్శించారు. గత పది ఏళ్ళుగా రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ఖజానాను లూఠీ చేసి రూ 7 లక్షల కోట్ల అప్పు చేసి పారిపోయారని ధ్వజమెత్తారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..