వర్షాకాలంలో తరచుగా కరెంటు కోతలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కరెంటు
పోయినప్పుడు ఎంతో చికాకును కలిగిస్తుంది. అలాంటి సందర్భంలో చార్జింగ్ లైట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
ఎమర్జెన్సీ లైట్లకు సంబంధించి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ బజాజ్ కంపెనీ LEDZ పేరుతో 8.5W Cfl రీఛార్జబుల్ ఎమర్జెన్సీ ఇన్వెర్టర్ LED బల్బును విడుదల చేసింది. తెల్లని ప్రకాశవంతమైన వెలుతురునిచ్చే ఈ బల్బు.. కరెంటు లేకపోయినా కూడా 4 గంటలపాటూ వెలుగుతుది.
కరెంటు వచ్చిన తర్వాత ఈ లాంప్ తిరిగి దానంతట అదే రీఛార్జ్ అవుతుంది. ఫుల్ గా రీఛార్జింగ్ అయ్యాక.. తనకు తానుగానే ఛార్జ్‌ను ఆపేసుకునే టెక్నాలజీ ఈ బల్బ్ లో ఉంది. ఇది 9 వాట్ల బల్బు. బరువు 145 గ్రాములు ఉంటుంది. ఇది A15 షేప్ సైజులో ఉంటుంది. దీని బ్రైట్‌నెస్ 900 ల్యూమెన్‌గా ఉంది. ఇది పొడవు 7, వెడల్పు 7, ఎత్తు 14 సెంటీమీటర్లు ఉంది.
కరెంటు ఉన్నప్పుడు ఈ బల్బు 900 ల్యూమెన్ కాంతినిస్తుంది. అలాగే కరెంటు పోయినప్పుడు మాత్రం ఇది 300ఎల్ ల్యూమెన్ కాంతిని ఇస్తుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది.
ఈ బల్బు సుమారు 15,000 గంటలు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం.. ప్రతీ రోజూ 10 గంటలపాటు వెలిగిస్తే.. ఇది 1,500 రోజులు పనిచేస్తుంది. అంటే.. సుమారు 4 సంవత్సరాలు పనిచేస్తుంది. కాగా ఈ బల్బుకి 1 సంవత్సరం వారంటీ ఉంది.
దీని అసలు ధర రూ.650 కాగా.. అమెజాన్‌లో ప్రస్తుతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.550కి అందుబాటులో ఉంది.
ఫీచర్లు & వివరాలు
బజాజ్ LEDZ ఇన్వర్టర్ 9W CDL బల్బ్
వాటేజ్ – 9 వాట్స్
వారంటీ – 1 సంవత్సరం.
4 గంటల వరకు లైట్ బ్యాక్ అప్
పూర్తి ఛార్జ్ తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ ఆటో కట్-ఆఫ్
LED బల్బ్ ప్యాక్
రంగు తెలుపు
మెటీరియల్ పాలికార్బోనేట్
బల్బ్ రకం LED
రంగు ఉష్ణోగ్రత రకం కూల్ డేలైట్ (6500-7500K)
కొలతలు
ఎత్తు 14 సెంటీమీటర్లు
పొడవు 7 సెంటీమీటర్లు
వెడల్పు 7 సెంటీమీటర్లు
నికర బరువు 145 గ్రాములు
గమనిక: : ఈ కథనంలోని వివరాలు ప్రజల అభిప్రాయాల నుంచి అలాగే అమెజాన్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని ఈ సైట్ నిర్ధారించలేదు.