
Bajaj Ledz Inverter Lamp : కరెంటు పోయినా 4 గంటలు వెలుగుతుంది..
వర్షాకాలంలో తరచుగా కరెంటు కోతలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కరెంటు
పోయినప్పుడు ఎంతో చికాకును కలిగిస్తుంది. అలాంటి సందర్భంలో చార్జింగ్ లైట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.ఎమర్జెన్సీ లైట్లకు సంబంధించి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ బజాజ్ కంపెనీ LEDZ పేరుతో 8.5W Cfl రీఛార్జబుల్ ఎమర్జెన్సీ ఇన్వెర్టర్ LED బల్బును విడుదల చేసింది. తెల్లని ప్రకాశవంతమైన వెలుతురునిచ్చే ఈ బల్బు.. కరెంటు లేకపోయినా కూడా 4 గంటలపాటూ వెలుగుతుది.
కరెంటు వచ్చిన తర్వాత ఈ లాంప్ తిరిగి దానంతట అదే రీఛార్జ్ అవుతుంది. ఫుల్ గా రీఛార్జింగ్ అయ్యాక.. తనకు తానుగానే ఛార్జ్‌ను ఆపేసుకునే టెక్నాలజీ ఈ బల్బ్ లో ఉంది. ఇది 9 వాట్ల బల్బు. బరువు 145 గ్రాములు ఉంటుంది. ఇది A15 షేప్ సైజులో ఉంటుంది. దీని బ్రైట్‌నెస్ 900 ల్యూమెన్‌గా ఉంది. ఇది పొడవు 7, వెడల్పు 7, ఎత్తు 14 సెంటీమీటర్లు ఉం...