Home » Liquor Scam | లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్.. మొత్తం 171 ఫోన్లు మాయమయ్యాయన్న ఈడీ
Delhi liquor policy scam

Liquor Scam | లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్.. మొత్తం 171 ఫోన్లు మాయమయ్యాయన్న ఈడీ

Spread the love

Liquor Scam | న్యూఢిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండేళ్ల క్రితం మద్యం కుంభకోణం జ‌రిగిన స‌మ‌యంలో ఉపయోగించిన ఫోన్ కనిపించకుండా పోయిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి. దీనిపై కేజ్రివాల్ ను ప్రశ్నించగా, అది ఎక్కడ ఉందో తనకు తెలియదని చెప్పారని ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇది 171వ ఫోన్ అని తెలిపారు. ఆ ఫోన్ లో ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన డేటాను ఉండవచ్చని వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు 36 మంది నిందితులకు చెందిన 170 ఫోన్‌లను గుర్తించలేకపోయామని ఈడీ పేర్కొంది.
చివరికి, ఏజెన్సీ వారు 17 ఫోన్‌లను గుర్తించి డేటాను రికవరీ చేసింది. ED తన ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియాను నిందితుడిగా పేర్కొంది. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు గాను మిగిలిన ఫోన్లను పగలగొట్టారని దర్యాప్తు అధికారులు ఆరోపించారు. ఇప్పటి వరకు, ఫోన్‌లు ల్యాప్‌టాప్‌లలో ఈ కేసుకు సంబంధించి చాలా సాక్ష్యాలు ల‌భించాయ‌ని ఏజెన్సీ ఛార్జిషీట్‌లో పేర్కొంది.

అయితే మే 2022 , ఆగస్టు 2022 మధ్య పెద్ద సంఖ్యలో నిందితులు తమ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను మార్చారని ఏజెన్సీ తెలిపింది. కాగా దీనిపై ఈడీ వాద‌న‌ను ఆప్ కొట్టి పారేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు “బిజెపి కార్యాలయం నుండి నిర్వహిస్తోంద‌ని పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ‘బీజేపీకి రాజకీయ భాగస్వామి’ అని ఆరోపించారు.

READ MORE  ED Officers Arrest | ఏసీబీ అధికారులకు చిక్కిన ఈడీ అధికారులు

జైలు నుంచే పాల‌న‌

కాగా Liquor Scam కేసులో కేజ్రీవాల్‌ను గురువారం సాయంత్రం అరెస్టు చేశారు, ఈడీ ఆయ‌న‌ను ప్రశ్నిస్తోంది. అతను మార్చి 28 వరకు ఏజెన్సీ కస్టడీలో ఉంటారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ఈడీ లాక్ అప్ నుంచే తన విధులను నిర్వర్తిస్తున్నారని ఆప్ పార్టీ పేర్కొంది. ఆదివారం, దేశ రాజధానిలో తాగునీరు, డ్రైనేజీకి సంబంధించి అరెస్టు చేసిన తర్వాత అతను తన మొదటి ఉత్తర్వును జారీ చేసినట్లు ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. లాక్-అప్‌లో కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా పేపర్ ఇవ్వలేదని ED వర్గాలు తెలిపాయి.

READ MORE  మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..