Home Viral Viral Video | ఆస్పత్రి వార్డులోకి వ‌చ్చిన‌ ఏనుగు.. కారణం తెలిసి చలించిపోయిన స్థానికులు

Viral Video | ఆస్పత్రి వార్డులోకి వ‌చ్చిన‌ ఏనుగు.. కారణం తెలిసి చలించిపోయిన స్థానికులు

0
11
elephant entered the hospital
Elephant Entered The Hospital
Spread the love

Elephant Viral Video : సోషల్ మీడియాలో ఒక‌ వీడియో హ‌ల్‌చల్ చేస్తోంది. ఒక‌ వ్యక్తి అనారోగ్యం కార‌ణంగా ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆస్పత్రి వార్డులో అంద‌రూ చూస్తుండ‌గానే ఊహించ‌ని షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక ఏనుగు ఆస్పత్రికి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. అంతా దానిని చూసి త‌మ‌పై దాడి చేస్తుందోన‌నే భయంతో ప్రాణా ల‌ను అర‌చేతిలోపెట్టుకొని ప‌రుగులు పెట్టారు. ఆస్పత్రి వార్డు తలుపు వద్దకు వ‌చ్చిన‌ ఏనుగు మోకాళ్ల‌పై పాకుతూ లోపలికి ప్ర‌వేశించింది. దీంతో ఏనుగు ఏం చేస్తుందో తెలియ‌క ఆస్పత్రికి సిబ్బంది సైతం అయోమయానికి గురయ్యారు.

Viral : తనను వదిపెట్టి వెళ్లొద్దంటూ మావటిని బతిమిలాడుతున్న ఏనుగు.. హృదయానికి హత్తుకునే వీడియో వైరల్  

Elephant Entered The Hospital : అయితే వార్డు లోపలికి వెళ్లిన ఏనుగు.. బెడ్‌పై పడుకుని ఉన్న తన మావ‌టి (సంర‌క్ష‌కుడు) ని చూసి క‌రిగిపోయింది. తొండంతో తన సంర‌క్షకుడి చేయి పట్టుకుని శోకిస్తూ అక్కడే ఉండిపోయింది. తన కేర్ టేక‌ర్ ను పరామర్శించిన ఏనుగును చూసి అక్కడున్న వారంతా చ‌లించిపోయారు. కాగా, కొన్ని రోజుల క్రితం జ‌రిగిన‌ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఈ ఏనుగుది గొప్ప మనసు అని ఆకాశానికెత్తేస్తున్నారు. ‘‘మనుషులు జంతువులుగా మారుతుంటే.. జంతువులు మనుషులుగా మారుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం 1.50 లక్షలకు పైగా వ్యూస్‌ను దాటేసింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here