Home » Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా
Valmiki corporation scam

Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా

Spread the love

Valmiki corporation scam | క‌ర్ణాట‌క‌లో వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభ‌కోణం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మంత్రి బి.నాగేంద్ర ప్రకటించారు. ప్రతిపక్షాలు సైతం మొద‌టి నుంచి మంత్రి బి. నాగేంద్ర రాజీనామాకు గట్టిగా డిమాండ్ చేశాయి. దీంతో నాగేంద్ర మంత్రి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ సమాచారాన్ని అందించారు. ప్రభుత్వ గౌరవాన్ని కాపాడటానికి నాగేంద్ర రాజీనామా చేశార‌ని పేర్కొన్నారు. మే 26న కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎమ్‌విఎస్‌టిడిసి) సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ విషాదకరమైన ఆత్మహత్య తర్వాత ప్రతిప‌క్ష‌ బిజెపి ముప్పేట దాడి చేసింది.

READ MORE  Sikkim Floods: ఆకస్మిక వరదల కారణంగా 19కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా తెలియని 103 మంది ఆచూకీ..

చంద్రశేఖరన్‌ మృతితో కార్పొరేషన్‌ పరిధిలోని నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా నిధుల బదిలీ చేసేందుకు సీనియర్ అధికారులు తనను బలవంతం చేశారని ఆయన ఒక నోట్‌లో ఆరోపించారు. కార్పొరేషన్ బ్యాంక్ ఖాతా నుంచి అనధికారికంగా ₹187 కోట్లు బదిలీ చేయడంతో కుంభ‌కోసం బ‌య‌ట‌ప‌డింది. అలాగే హైదరాబాద్‌లోని ప్రముఖ IT కంపెనీలు, సహకార బ్యాంకుతో సహా వివిధ ఖాతాలకు ₹88.62 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కర్నాటకలో ఇది పెను సంచ‌ల‌నంగా మారింది.

READ MORE  Bengaluru Metro Phase 3 | బెంగళూరు మెట్రో ఫేజ్-3: భూసేకరణ ప్రణాళిక సిద్ధం.. 2028కి పూర్తి

చంద్రశేఖరన్ విషాద మరణం, ఆయ‌న భార్య ఫిర్యాదు చేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. అలాగే, కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై ఆరోపిస్తూ కార్పొరేషన్ చీఫ్ రెగ్యులేటర్ ఎ. రాజశేఖర్ బెంగళూరులో ఫిర్యాదు చేశారు. ఈ అనూహ్య‌ ప‌రిణామాల మధ్య కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని నిలబెట్టాలనే లక్ష్యంతో మంత్రి బి.నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాలలో లోక్‌సభ ఎన్నికల సమయంలో నిధుల బదిలీ కోసం అక్ర‌మాలకు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కాగా వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం (Valmiki corporation scam) పై జరుగుతున్న విచారణలో మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేయడం ఒక కీల‌క‌ పరిణామంగా చెప్ప‌వ‌చ్చు.

READ MORE  Ayodhya Ram Mandir Updates : బాల రాముడి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. 10 రోజుల్లో ₹ 12 కోట్లకు పైగా విరాళాలు 

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..